weight loss diet tips in Telugu ​బరువు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?

weight loss tips Telugu బరువు తగ్గాలంటే

బరువు తగ్గాలంటే ముఖ్యంగా ఆహారంలో బరువు తగ్గాల్సిందేనని న్యూట్రీషన్లు అంటున్నారు. రోజువారీ డైట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉండేలా, లో క్యాలరీ ఫుడ్‌గా ఉండాలని వారు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్లు ఆధారంగా అత్యవసరమైన పోషకాలు సరైన సమయంలో తీసుకుంటే బరువు తగ్గవచ్చునని శరీరాకృతిని మెరుగుపరుచుకోవచ్చు. 

ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..?

కొవ్వు తీసేసిన పాలను తాగాలి. ఎముకలు బలంగా ఉండటానికి – మాంసకృత్తులు, క్యాల్షియం అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, మాంసకృత్తుల కోసం – కోడిగుడ్డులోని తెల్ల సొన, స్కిన్‌లెస్ చికెన్‌, వేరుశనగలు వంటివి తీసుకోవాలి.


హోల్‌ వీట్‌, జొన్నలు, తెల్ల ఓట్స్‌, రాగిమాల్ట్. శెనగలు, రాజ్‌మా, బొబ్బర్లు, పచ్చి బఠాణి, సోయా ఉత్పత్తులు, పెసలు, మొలకెత్తిన గింజలు…వీటి వల్ల మాంసకృత్తులు, పిండి పధార్ధాలు, ‘బి’ విటమిన్లు అందుతాయి. తద్వారా బరువు తగ్గుతుంది. ముదురు పసుపు, నారింజ రంగు పండ్లు, కూరగాయలు, తాజా ఆకుకూరలు తదితరాలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారని న్యూట్రీషన్లు అంటున్నారు. 


చిట్కాలు

1. బరువు తగ్గాలనుకునే వారు వారానికి ఒక రోజు అన్ని పూటలూ భోజనానికి బదులుగా కూరగాయలు, ఆకుకూరలతో చేసిన సలాడ్ తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీంతోపాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా తగినంతగా లభిస్తాయి. 

2. తగిన చోటు, సమయం చూసుకుని కూర్చుని భోజనం చేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. దీంతో అది త్వరగా జీర్ణమవుతుంది. 

3. సాధ్యమైనంత చిన్న సైజ్ ప్లేట్‌లో భోజనం చేస్తే మీకు తెలియకుండానే పూటకు కనీసం 250 క్యాలరీలైనా తగ్గించి తింటారు. 

4. నిద్రలేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేయాలి. ఆలస్యంగా తింటే రెండు భోజనాల మధ్య సమయం తగ్గి కొవ్వు పెరుగుతుంది. 

5. రోజూ పాల ఉత్పత్తులు ఎంతో కొంత పరిమాణంలో తీసుకోవాలి. వీటిలోని కాల్షియం కొవ్వుని కొంత మేరకు తగ్గించగలదు. 

6. వ్యాయామం చేసిన తరువాత 30 నుంచి 60 నిమిషాల లోపు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. కొత్తగా చేరే క్యాలరీలను శరీరం అలసిపోయినప్పుడు వెంటనే ఉపయోగించుకుంటుంది. 

7. భోజనానికి ముందు నారింజ లాంటి నిమ్మజాతి పండు సగం తింటే బరువు తగ్గుతారని పరిశోధనల్లో తెలిసింది. 

8. వారంలో 3 రోజులు గుడ్లు, ఒక పూట చేప తినడం కూడా బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది