Telugu Premam Movie Review Rating (4/5)| ప్రేమమ్ సమీక్ష
Telugu Premam Movie Review Rating (4/5)| ప్రేమమ్ సమీక్ష

నటీనటులు : అక్కినేని నాగచైతన్య, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్,మడొన సెబాస్టియన్

సినిమాటొగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని
ఎడిటింగ్ : కోటగిరి వెంకటెశ్వరరావు
సంగీతం : గోపి సుందర్, రజేష్ మురుగేశన్
ప్రొడ్యూసర్ : నాగవంశీ సూర్యదేవర
దర్శకత్వం : చందూ మొండేటి
విడుదల తేది : అక్టోబర్ 7, 2016

అక్కినేని నాగ చైతన్య హీరో గా మళయాళ సూపర్ హిట్ క్లాసిక్ ప్రేమమ్ ని రీమేక్ చేస్తూ సితార ఎంటర్టైన్మెంట్స్ బానర్ మీద సూర్య దేవర నాగ వంశి నిర్మించిన చిత్రం ప్రేమమ్. కార్తికేయ తో దర్శకుడి గా సూపర్ హిట్ కొట్టిన చందూ మొండేటి రెండవ చిత్రం ఇది. భారీ అంచనాల నడుమ దసరా బరి లో దిగిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే సమీక్ష లోకి వెళ్ళాల్సిందే.

కథ :

ఒక యువకుడి జీవితం లోని మూడు దశల్లో కలిగే ప్రేమ ని, దాని వల్ల వచ్చే పరిణామాల్ని చూపించే ఈ చిత్రం మళయాళం లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒరిజినల్ కథ లో కొన్ని మార్పులని చేసి తెలుగు నేటివిటి కి అణుగుణం గా మార్చి చేసిన ప్రయత్నం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు అనే చెప్పుకోవాలి. మళయాళం ప్రేమమ్ దాదాపు 170 నిమిషాల రన్ టైం ఉండగా తెలుగు వెర్షన్ లో కాస్త నిడివి తగ్గించి చేశారు.

నటీనటులు :

ముఖ్యం గా ప్రేమ కథా చిత్రం చేసిన ప్రతి సారి సక్సెస్ తన ఖాతా లో వేసుకున్న నాగ చైతన్య మూడు వయసుల్లో ఉన్న యువకుడు గా మంచి నటన కనపరిచాడు. చాలా పరిణితి తో ఆకట్తుకున్నాడు. పదహారు ఏళ్ళ కుర్రవాడు గా అమాయకత్వం కలగలిసిన పాత్ర కాని, కాలేజ్ లో ఎరొగెంట్ గా ఉంటు, టీచర్ మీద క్రష్ ఉన్న పాత్ర లో కాని, ఒక షెఫ్ గా లైఫ్ లో సెటిల్ అయిన పాత్ర లో మెచ్యూరిటీ కాని చాలా చక్కగా చేసి ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఖచ్చితం గా నటుడు గా మరొక మెట్టు ఎక్కేశాడు. హీరోయిన్స్ విషయానికి అవ్స్తే అనుపమా పరమేశ్వరన్ క్యూట్ గా ఉంది, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. శ్ర్తీ హాసన్ బాగా చేసింది. మడొనా సెబాస్టియన్ కి ఒరిజినల్ లో కంటే పాత్ర నిడివి పెరిగింది, ఈ అమ్మాయ్ కూడా పూర్తి మార్కులు సాధించింది. వీళ్ళే కాక విక్టరి వెంకటేష్ డి సి పి రామ చంద్ర గా తళుక్కున మెరువగా, కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్ తో పాటు క్లైమాక్స్ లో కాసేపు కనిపించి అలరించారు.

సాంకేతిక నిపుణులు :

సాంకెతిక నిపుణుల్లోకి వస్తే మొదటి మార్కులు సంగీతానికి వెయ్యాలి. గోపి సుందర్, రాజేష్ మురుగెశన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపధ్య సంగీతం కూడా సినిమా ఫీల్ ని కారీ చేసే విధం గా ఉంది. కార్తీక్ అందించిన సినిమాటోగ్రఫి బావుంది, ముఖ్యం గా గోవా లో షూట్ చేసిన పోర్షన్ లో, అతని పనితనం ఆకట్టుకుంటుంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటెశ్వరరావు గారు మరొక్క మారు ఆకట్టుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలానే బావున్నాయి. ఇక దర్శకత్వం విష్యానికి వస్తే రెండవ చిత్రం చేస్తున్న చందూ బానే చేశాడని చెప్పుకోవాలి. కాని స్క్రీన్ ప్లే విషయం లో మరింత శ్రద్ద తీఉస్కుని ఉండాల్సింది.అక్కడక్కడ కాస్త స్లో అయినట్టు గా అనిపిస్తుంది. శృతి హాసన్ తో ఉన్న సన్నివేశాలు ఇంకాస్తా బాగ చెయ్య వచ్చు అనిపిస్తుంది. కామెడి అక్కడక్కడా బావుంది. విక్టరి వెంకటేష్, కింగ్ నాగార్జున ఉన్న సన్నివేశాలు బావున్నాయి. నాగార్జున ఇచ్చిన వాయిస్ ఓవర్ మరొక మేజర్ ప్లస్.

గోల్డ్ (+) :

నాగ చైతన్య నటన
ఆనుపమ పరమెశ్వరన్
సంగీతం
వెంకటేష్,నాగర్జునల కామియో రోల్స్

రోల్డ్ గోల్డ్ (-) :

కామెడి
కొన్ని చోట్ల స్లో గా ఉంది

ఓవర్ ఆల్ గా యువత ని థియేటర్ల ముందు క్యూ కట్టించే చిత్రం ఇది. సరదాగా సాగిపోయే కథ,మంచి సంగీతం, మంచి నటన అన్ని కలిసిన ఈ చిత్రం హిట్ అయ్యే లక్షణాలు పుష్కలం గా ఉన్నాయి. ఒరిజినల్ చిత్రం తో పోలిక లేకుండా చూస్తే ఖచ్చితం గా ఎంజాయ్ చేసే చిత్రం.

 రేటింగ్ : 4/5

మీకు నచ్చితే  షేర్ చేయండి మరియు మీ Reaction  చెప్పండి

like-me

Category:

Telugu Movies news