రూపాయికే రెడ్‌మి ఫోన్లు: ఆఫర్ మూడు రోజులే

చైనా దిగ్గజం షియోమి మరో సంచలనానికి తెరలేపింది. షియోమి మి దివాళి 2016 పేరుతో రానున్న ఈ పండుగలో రూపాయికే రెడ్ మి టాప్ బ్రాండ్ ఫోన్లను అందించనుంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఇస్తున్న పండుగ ఆఫర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 వరకు

షియోమి ఈ దీవాళి సేల్ ఆఫర్ ను అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 వరకు నిర్వహిస్తుంది. కంపెనీ యానివర్సరీ సంధర్భంగా రూపాయి ఫ్లాష్ సేల్ ని నిర్వహించనుంది.

మిగతా కష్టమర్లకు కూడా కొన్ని ఆపర్లను

ఈ ఆఫర్లలో భాగంగా మిగతా కష్టమర్లకు కూడా కొన్ని ఆపర్లను ప్రకటించింది. రూ.5 వేల నుంచి రూ. 15 వేల వరకు కొనుగోలు చేిన వారికి మికీ చైన్ ఇవ్వబడుతుంది. అలాగే రూ. 15 వేల పైన కొనుగోలు చేసినవారికి మి యుఎస్బి ఫ్యాన్ ఇవ్వబడుతుంది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 19 వరకు కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది.

అక్టోబర్ 17న రూపాయి సేల్ లో భాగంగా 30 red mi 1s primie ఫోన్లు, 100 షియోమి బ్లూటూత్ స్పీకర్స్ పై ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

అక్టోబర్ 18న రూపాయి సేల్ లో భాగంగా 30 red mi note 3s, 100 20,000 MAh పవర్ బ్యాంకులపై నిర్వహిస్తారు.

అక్టోబర్ 19న రూపాయి సేల్ లో భాగంగా 30 mi 4s, 100 mi BAND2లపై సేల్ నిర్వహిస్తారు.

అక్టోబర్ 17న జరగబోయే పెస్టివల్ సంబరాల్లో షియోమి తన కొత్త ఫోన్ మి మ్యాక్స్ ని విడుదల చేయనుంది. స్నాప్ డ్రాగన్ 652తో రానున్న ఈ ఫోన్ 4 జిబి ర్యామ్ తో పాటు, 128 జిబిఇంటర్నల్ మెమొరీని కలిగి ఉంది. సిల్వర్ గోల్డ్ కలర్స్ లో రానున్న ఈ వేరియంట్ ధరను కంపెనీ రూ. 19,000గా నిర్ణయించింది.

దీంతో పాటు మరో వేరియంట్ మి 5 కూడా రూ.22,999కే జీరో పర్సంట్ ఇంట్రస్ట్ తో కష్టమర్లకు అందించనుంది. ఈ ఆఫర్ కూడా కేవలం 3 రోజుల సేల్ లో భాగంగా మాత్రమే ఉంటుంది.

షియోమిఈ పెస్టివల్ సేల్ లో భాగంగా ఇంకా అనేక రకాలైన షియోమి ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించనుంది. అలాగే కూపన్ కోడ్ లను కూడా ఇవ్వనుంది. సో మీరు ఆ రోజు రెడీగా ఉంటే షియోమి ఫోన్లను రూపాయికే సొంతం చేసుకోవచ్చు.