బాహుబ‌లి 2 ఇంకా పూర్తికాలేదు. అయితే అప్పుడే రాజ‌మౌళి త‌దుప‌రి సినిమాపై బోల్డ‌న్ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆయ‌న ఈగ 2 చేస్తారని, మ‌హాభార‌తంని తీస్తారని వార్త‌లొచ్చాయి.

rajamolii-mesh

అయితే వాస్తవం మాత్రం వేరుగా వుంది. బాహుబలిని భుజాన ఎత్తుకొని దాదాపు ఐదేళ్ళు ప్రయాణం చేశారు రాజమౌళి. మాములు సినిమాలు అయితే కనీసం ఓ ఐదు వరకు తీసేద్దురు ఈ గ్యాప్. కాని బాహుబలి స్కేల్ వేరు కదా అందుకే ఇంత సమయం కేటాయించారు. అయితే అంతకుముందు ఆయన కొంతమంది నిర్మాతలకు మాటిచ్చారు. బాహుబలి తర్వాత ఆ కమిట్మెంట్లు లను ఫినిష్ చేయాలని భావిస్తున్నారు రాజమౌళి.

రాజమౌళి మాటిచ్చిన నిర్మాతల్లో కెఎల్ నారాయణ ఒకరు. ఇప్పుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీసే సినిమా ఆయనదే కావచ్చిని తెలుస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే.. కెఎల్ నారాయణ దగ్గర మహేష్ బాబు డేట్స్ వున్నాయి. ఈ డేట్స్ రాజమౌళి సినిమా కోసమే అని తెలిసింది. రాజమౌళి- మహేష్ మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్. ఎప్పటినుండో చర్చల్లో వుంది. ఇప్పుడీ ఈ కాంబినేషన్ సెట్ కావడం ఖాయమని బోగట్ట.