Pawan kalyan trivikram movie title confirmed దేవుడే దిగి వచ్చిన

Pawan Kalyan Trivikram Movie Title Confirmed | దేవుడే దిగి వచ్చినా పవన్ ను ఆపలేరు.!

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో వీరి కాంబినేషన్‌ మూవీకి అంచనాలు ఉంటాయి. దాంతో వీరి సినిమాను తెచ్చేందుకు పలువురు టాలీవుడ్‌ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. త్రివిక్రమ్‌తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఈయన మరోసారి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ హీరోగా ఒక సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

 

టాలీవుడ్‌ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాకు ‘దేవుడే దిగి వచ్చినా..’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమా టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌లో అప్లై చేసినట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఆ టైటిల్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌ వారు రిజిస్ట్రర్‌ చేయనున్నారు. అయితే ఆ టైటిల్‌తో సినిమా పవన్‌, త్రివిక్రమ్‌లదేనా అనేది కొందరి అనుమానం. ఏది ఏమైతేనేం త్రివిక్రమ్‌, పవన్‌ల కాంబోలో సినిమా రావడం దాదాపు ఖాయం, ఆ సినిమాను రాధాకృష్ణ నిర్మించబోతుండటం నిజం. అందుకే వారి సినిమాకు టైటిల్‌గా ‘దేవుడే దిగి వచ్చినా’ను నిర్ణయించి ఉండవచ్చు అనేది ఊహాజనితం. మరి ఈ ఊహ నిజం అయ్యేనా అనేది చూడాలి. ఈ సినిమా పట్టాలెక్కాలంటే కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి…

like-me