”అమ్మాయి చెంపదెబ్బ కొట్టినప్పుడు కళ్యాణ్ అన్న ఏం పర్లేదు పర్లేదు అంటుంటే.. అసలు ఆయన్ను అలా చూస్తానని అనుకోలేదు. ఆయనలో ఉండే యాటిట్యూడ్ అదిరిపోయింది. కలిసిపెరిగిన నేను చూడని కొత్త యాటిట్యూడ్ చూపించారు పూరి భయ్యా” అంటూ తన అన్న కళ్యాణ్ రామ్ ను ”ఇజం”తో కొత్తగా ఆవిష్కారించారని మురిసిపోయాడు జూ.ఎన్టీఆర్.

”ఆన్నే నాకు సర్వస్వం. ఆయనే ఫ్రెండ్. తను నా వెల్ విషర్.. కొన్నిసార్లు నా గాళ్ ఫ్రెండ్ కూడా” అని చెబుతూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు జూనియర్ ఎన్టీఆర్. సాధారణంగా ఎప్పుడూ కళ్యాణ్ రామ్ గారు అంటూ మాట్లాడే ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అన్న అంటూ క్లోజ్ గా పిలుస్తుంటే మతిపోయింది అందరికీ. గతంలో కేవలం అప్పుడప్పుడే అన్న అనే ఎన్టీఆర్.. ఇప్పుడు ఎందుకో తనలోని రియల్ ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టేశాడు.

”కష్టం అంటే ఆయన సిక్స్ ప్యాక్ బాడీ గురించి కాదు.. స్వతాహాగా ఒక నటుడిగా ఆయనపడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఇంత కష్టపడిన తరువాత ఆయన కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ”ఇజం” అనేది ఆయనకు అతి పెద్ద విజయంగా కనిపిస్తుంది” అంటూ అన్నయ్య కళ్యాన్ రామ్ గురించి చెప్పాడు.

ఇకపోతే హీరోయిన్ అదితి ఆర్యకు.. ”వెల్ కమ్ టు తెలుగు ఫ్రెటర్నిటీ” అంటూ శుభాకాంక్షలు చెప్పాడు యంగ్ టైగర్.