ఎన్టీఆర్ అంటే పరిశ్రమలో ఎన్టీఆర్ మనువడిగానే కాక తన కృషితో మంచి పేరుని సాధించాడు. పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాలంటే ఈ తరం హీరోలలో నెంబర్ వన్ తారక్ అని రాజమౌళి సైతం అంటారు. మహాభారతం వంటి సినిమా చెయ్యాలంటే అందులో ఎన్టీఆర్ తప్పకుండా ఉండాలని అంటాడు రాజమౌళి.

స్టూడియో నెంబర్ వన్ తో ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చిన ర్జమౌలి ని ఎన్టీఆర్ కి ఉన్న మంచి రిలేషన్ గురించి మనందరికీ తెలిసిందే. జక్కన్న గురువు అయిన రాఘవేంద్రరావు కూడా జూనియర్ తో ఓ చారిత్రక సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం నమో వేంకటేశాయ సినిమాలో బిజీగా ఉన్న రాఘవెంద్రరరావు. అయన చెప్పిన స్టొరీ లైన్ తారక్ కి కూడా నచ్చిందట. సంక్రాంతి తర్వాత ఈ సినిమాపై పూర్తిగా వర్క్ చేయాలని అనుకుంటున్నారట.

రాఘవేంద్రరావు అనుకుంటున్న కథను యంగ్ టైగర్ అయితేనే సరిగ్గా సెట్ అవుతాడని, ఇది ఓ ఫాంటసీ కథ అని సమాచారం. అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఆధ్యాత్మిక సినిమాలను తీసిన దర్శకేంద్రుడు జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఫాంటసీ సినిమాని కూడా తెరకెక్కించాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే తెలుగు, తమిళ్ తో పాటు హిందీలో ఒకేసారి విడుదల అవుతుందట. జక్కన్న డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకేంద్రుడు దర్శకత్వ పర్యవేక్షణ అందించారు.

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.

Category:

Telugu Movies news