ఒక ప్రక్కన తనకు ‘ఎన్’ లాకెట్ జీవితంలో చాలా ముఖ్యమైనదని చాలాసార్లు చెప్పింది. ఆ విషయం చెప్పడంతోనే అసలు నాగ చైతన్యను ఆమె ప్రేమిస్తోంది అనే విషయం బయటపడింది. అయితే ఇప్పుడు చైతూ కూడా తన సైడ్ నుండి చాలా విషయాలు బయటపెట్టేస్తున్నాడు. అందులో భాగంగా ఆ టాటూ గురించి కూడా రివీల్ చేశాడు.

#Samantha #NagaChaitanya Tattoo Secret

Posted by filmagar.com on Tuesday, October 4, 2016

చైతన్య అండ్ సమంత ఇద్దరూ కూడా తమ కుడి చేతి మణికట్టు దగ్గర ఓ రెండు యారోస్ టాటూగా వేయించుకున్నారు. వీరి ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. అయితే ఈ పచ్చబొట్టుకు ఏదైనా మీనింగ్ ఉందా? ఇద్దరూ ఒక్కటే టాటూ వేయించుకోవడం వెనుక కూడా ఏదైనా రీజన్ ఉందా? దీని స్పందించిన నాగ చైతన్య ఏమన్నాడంటే.. ”ఇది రోమన్ సింబల్స్లో ఒకటి. దీని అర్థం మన రియాలిటీని మనమే క్రియేట్ చేసుకోవాలి అని” అంటూ సెలవిచ్చాడు. మరి ఇద్దరూ అదే వేయించుకున్నారేంటి అంటే.. ”ఎవరికి వాళ్ల రియాలిటీ మ్యాచ్ అయితే..” అంటూ నవ్వేశాడు.

మొత్తానికి చైతూ అండ్ సామ్ టాటూ మీనింగ్ తెలిసింది కదా.. మరి మీరు కూడా మీ సొంత రియాలిటీని క్రియేట్ చేసుకోవాలంటే ఆ సింబల్ పచ్చబొట్టు వేయించుకుండా. ఆ సింబల్ గురించి ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే.. అది వైకింగ్ సింబల్స్ లో ఒకటి.