ఓవైపు 150వ చిత్రం తోనే కాదు… బుల్లితెరపై యాంకరింగ్ తో సందడి చేయబోతున్నాడు మెగాస్టార్. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం సీజన్ 4 కి వ్యాఖ్యాతగా నాగ్ ప్లేస్ లో చిరంజీవి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ చిన్న ప్రోమోను విడుదల చేసింది మా టీవీ యాజమాన్యం.

కోట్ల హృదయాలను కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించడానికి వస్తున్నాడు అంటూ పవర్ పుల్ బ్యాగ్రౌండ్ తో చిరు లుక్ ను చూపించి చూపించనట్లుగా చూపించేశారు. గడ్డం అవతారంలో సూట్ లో చిరు నడిచివస్తున్న వీడియోకు విత్ ఇన్ షార్ట్ టైంలోనే దుమ్మురేగిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ పూర్తిగా చిరు లుక్స్ రివీల్ చేయకుండా రూపొందించిన ఈ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఓవైపు ఖైదీ నంబర్ 150 డబ్బింగ్ చెబుతూనే, ఇంకోవైపు మీలోఎవరు కోటీశ్వరుడు కోసం ఎపిసోడ్స్ లోపాల్గొంటున్నాడు.

నాగార్జున హోస్ట్ గా ఉన్న మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోను ఈ సారి మెగాస్టార్ చిరంజీవి చేత చేయించాలని మాటీవీ యాజమాన్యం యోచిస్తోంది. ఇప్పటి దాకా నాగ్ మూడు సీజన్లు చేశారు..నాలుగో సీజన్ డిసెంబర్ 12 నుంచి మొదలుకాబోతోంది. దీనికి హోస్ట్ గా నాగ్ కు బదులు చిరు చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. నాగ్ వద్దన్నారో లేక చిరు ఆసక్తి చూపారో తెలీదు గానీ నెక్స్ట సీజన్ మాత్రం చిరు చేయడం ఖాయమంటున్నారు. మూడో సీజన్ లో ఓ గెస్ట్ గా చిరంజీవి ఎంఇకె లో పాల్గొన్నారు. చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కు ఇబ్బందికలగకుండా దీని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.