ఇంకో రెండేళ్ల తర్వాతే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పటికీ.. ఇప్పట్నుంచే ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇటీవలే ప్రత్యేక హోదా విషయమై పోరాటం మొదలుపెట్టిన పవన్.. ఇప్పుడు జనసేన పార్టీని యువతలోకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రోజు సోషల్ మీడియాలోకి జనసేన అరంగేట్రం చేసింది. పవన్ పార్టీ కోసం ట్విట్టర్లో.. ఫేస్ బుక్ లో అధికారిక అకౌంట్లు తెరిచారు. అంతే కాక యూట్యూబ్ లోనూ జనసేన కోసం ప్రత్యేకంగా ఒక ఛానెల్ మొదలుపెట్టారు.

ఇవన్నీ ఈ రోజు నుంచి యాక్టివ్ గా ఉంటాయని.. పార్టీకి సంబంధించిన విశేషాలన్నింటినీ ఇందులో పంచుకుంటామని జనసేన నాయకులు ప్రకటించారు. పార్టీ విధానాలు.. సిద్ధాంతాలు.. వివిధ అంశాలపై పవన్ అభిప్రాయాలు.. పవన్ రాజకీయా కార్యకలాపాలపై అప్ డేట్స్.. ఇతర విశేషాల్ని ఇందులో సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడిస్తామన్నారు. అభిమానులు.. కార్యకర్తలు వీటిని అనుసరించాలని కోరారు. జనసేన.. మనసేన అనే నినాదంతో ఓ లోగో తయారు చేసి.. ఈ పేజీల ముఖచిత్రాల్ని అలంకరించారు వీటి నిర్వాహాకులు.

జనసేన పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్.. ఫేస్ బుక్.. యూట్యూబ్ ఛానెల్ లింకులివే..