రచయితగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత దర్శకుడుగా మారి ప్రస్తుతం సంచలన నటుడిగా మారిపోయిన పోసాని కృష్ణమురళి ఒక ఇంటర్వ్యులో చిరంజీవి పవన్ కళ్యాణ్ లను ఉద్దేసించి  చేసిన కామెంట్స్ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. చిరంజీవి చాల నిజాతీ పరుడు అని అంటూ మెగా స్టార్ ను తెగ పొగిడిన పోసాని ఇదే సందర్భంలో పవన్ గురించి తనకు ప్రశ్న ఎదురైనప్పుడు కొన్ని ఆ సక్తికర కామెంట్స్ చేసాడు.
ఒక వ్యక్తి గురించి తాను మాట్లాడాలంటే ఆ వ్యక్తి నిజాయితీ పరుడైనా అయి ఉండాలి, లేదంటే  చెడ్డ వ్యక్తిత్వం గలవాడైనా అయి ఉండాలి అని అంటూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు దాట వేసే ప్రయత్నం చేసాడు పోసాని. ఇదే సందర్భంలో పవన్ ‘జనసేన’ పార్టీ గురించి మాట్లాడుతూ తనకు ఇప్పటి వరకు ‘జనసేన పార్టీ సిద్ధాంతాలు అర్ధం కాలేదని అవి అర్ధం చేసుకున్న తరువాత మాత్రమే వాటి పై స్పందిస్తాను అంటూ మరొక ట్విస్టు ఇచ్చాడు పోసాని.

ఇదే సందర్భంలో తాను చిరంజీవి పెట్టిన ‘ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికలలో చిలకలూరిపేటలో పోటీ చేసి వోడిపోయిన సందర్బాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ ఎన్నికలలో తాను ప్రజారాజ్యం తరఫున పోటీ చేయడానికి పార్టీ ఫండ్ గా ఒక్క రూపాయి కూడ చిరంజీవికి ఇవ్వలేదన్న విషయాన్ని బయట పెట్టాడు పోసాని. అంతేకాదు రాజకీయాలలో చిరంజీవి లాంటి మంచి వ్యక్తిని తాను ఇప్పటి వరకు చూడలేదు అంటూ చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశాడు పోసాని.
ఇక తాను డబ్బులు ఖర్చు పెట్టలేకపోవడం వల్లే ఓడిపోయాను అని అంటూ అన్నయ్య చిరంజీవి మళ్లీ ప్రజారాజ్యం పార్టీని మొదలు పెడితే తాను ఆయనతో ఉండటానికి సిద్ధంగా ఉన్నాననిచెపుతూ చిరంజీవిని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నాడు పోసాని.  ఇక  పోసాని తన కామెంట్స్ తో సల్మాన్ ఖాన్ ని కూడ టార్గెట్ చేస్తూ మరి ట్విస్టు ఇచ్చాడు.

పాకిస్థాన్ నటులకు మద్దతుగా నిలిచిన సల్మాన్ తీరును టార్గెట్ చేస్తూ దేశంలో సల్మాన్ ఖాన్ కంటే పెద్ద తీవ్రవాది మరెవరూ లేరని ఘాటైన కామెంట్స్ చేసాడు పోసాని. అంతేకాదు సల్మాన్ ఖాన్ అంత ఉత్తముడేం కాదని అతడు అంత ఉత్తముడైతే తన కారు యాక్సిడెంట్ జరిగిన రోజున అక్కడ ఉండకుండా ఎందుకు పారిపోయాడని అంటూ ఏకంగా బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ కూడ వదిలి పెట్టలేదు పోసాని.
టాలీవుడ్ లో అత్యంత  ఆవేసపరుడుగా పేరు గాంచిన పోసాని ఇలా చిరంజీవిని పొగుడ్తూ లక్షలాది మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ పై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు పోసాని చేయడం వెనుక ఏమైనా అర్ధాలు ఉన్నాయా అంటూ ఇప్పుడు పోసాని చేసిన కామెంట్స్ పై చర్చలు జరుగుతున్నాయి..