ఏంటి టైటిల్ చూసి షాక్ అయ్యారా.. అవునండీ.. అన‌సూయ తాగుతుంది. తాగ‌ట‌మే కాదు , ఆ కిక్కులో భ‌ర్త‌కు చుక్క‌లు చూపిస్తుంద‌ట‌. సినిమా ఇండ‌స్ట్రీలో ఉండే చాలా మంది హీరో హీరోయిన్స్ త‌దిత‌రుల‌కు తాగుడు అల‌వాటు ఉంటుంది..ఎందుకంటే, లేట్ నైట్ వ‌ర్క్స్ , ఫార‌న్ ట్రిప్స్ , పార్టీస్ వంటి హంగుల‌తో నిత్యం హాడావుడిగా ఉండే రంగుల ప్ర‌పంచంలో తాగ‌టం అనేది చాలా కామ‌న్ థింగ్‌. అయితే ఈ క‌ల్చ‌ర్‌కు నేను సైతం ఏ మాత్రం తీసిపోనూ అంటుంది హాట్ యాంక‌ర్ అన‌సూయ‌.

ప్ర‌స్తుతం ఎ డేట్ విత్ అన‌సూయ షో ద్వారా ప్రేక్ష‌ల‌కు మ‌రింత ట‌చ్‌లోకి వచ్చిన అన‌సూయ ఇటీవ‌ల‌ ఈ తాగుడు డిటేల్స్ బ‌య‌ట‌పెట్టింది. ఈ షోకి గెస్ట్‌గా వ‌చ్చిన స్టార్ హీరోయిన్ రెజీనాపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఈ హాట్ యాంక‌ర్ ప‌నిలో ప‌నిగా తాగుడు గురించి కూడా అడిగేసింది. అయితే రెజీనా ఎటువంటి మొహ‌మాటం లేకుండా తాగుతాన‌ని ఒప్పుకుంటూ, తాగి త‌న అమ్మ‌తో చేసిన ర‌చ్చ గురించి బ‌య‌ట‌పెట్టింది. ఇదే స‌మ‌యంలో అన‌సూయ కూడా త‌న తాగుడు బాగోతం బ‌యట‌పెట్టింది.”

య‌స్ ఆల్వేస్‌.. బ‌ట్ చాలా త‌క్కువ తాగుతాను.. తాగుడు పెద్ద‌గా అల‌వాటు లేదు క‌నుక తాగిన వెంట‌నే ఎక్కేస్తుంది. అంతే ఆ తాగింది దిగే వ‌ర‌కూ ర‌చ్చ చేస్తా.. అయితే నా ర‌చ్చ అంద‌రిపై కాదు.. నా భ‌ర్త‌పై మాత్ర‌మే. తాగితే మాత్రం నా భ‌ర్త‌కి చుక్కేలే ” అంటూ త‌న సీక్రెట్స్ బ‌య‌ట‌పెట్టింది ఈ హాట్ యాంక‌ర్‌.. ఎంత వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌కి అల‌వాటు ప‌డితే మాత్రం ఇంటి గుట్టు వీధిలో పెట్టాలా అని కొంద‌రు అన‌సూయ‌పై సెటైర్స్ వేస్తుంటే, చేసే ప‌నిని దైర్యంగా చెప్పిందంటూ మ‌రికొంద‌రు పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.