Allu Arjun Acts as Villain Role For His Next Film

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళ దర్శకుడు లింగు స్వామి తెరకెక్కించనున్న బైలింగ్వల్ చిత్రంలో నటించనున్నట్లు తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ కీర్తి సురేష్ ను ఫిక్స్ చేశారు. తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న కీర్తి సురేష్, ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకొని ఆమెను సంప్రదించగా.. బన్నీ సరసన అనగానే వెంటనే ఒప్పుకుందని కోలీవుడ్ సినీవర్గాలు చెప్పాయి.

అయితే మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తాడట. తెలుగులో హీరో నెగెటివ్ షేడ్‌లో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పూరి జగన్నాథ్ తన సినిమాల్లో హీరోలను ఇదే స్టైల్లో చూపిస్తాడు. అయితే ఇటు క్లాస్, అటు మాస్ హీరోయిజం చూపించే స్టైలిష్ స్టార్, ఆర్య2 సినిమాలో కూడా పాత్రలో నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ పోషించాడు.. అయితే ఇప్పుడు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమాలో బన్నీ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కాగానే లింగుస్వామి మన బన్నీని విలన్ లాంటి హీరోగా మార్చేయనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*