Airtel, Vodafone, idea పై మొత్తం రూ.3,150 కోట్ల జరిమానా

wp-1477409226997.jpg

ప్రముఖ టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలకు షాక్ ఇచ్చింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌). ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాపై మొత్తం రూ.3,150 కోట్ల జరిమానా విధించాలని టెలికాం శాఖకు సూచించింది.

భారత టెలికాం మార్కెట్ లో రిలయెన్స్ జియో తో సరికొత్త అధ్యాయం శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యారు రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ. ఇప్పటికే కొన్ని టెలికాం సంస్థలు అంబానీతో చేయి కలిపాయి. అయితే ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాలు మాత్రం జియోకు పోటిగా నిలబడాలని నిర్ణయించుకున్నాయి. జియోతో కాల్స్‌ అనుసంధానం కావడానికి ఇష్టం చూపడం లేదు. దీంతో ఆ టెలికాం ఆపరేటర్లుపై ఇప్పటికే ట్రాయ్‌ కి పిర్యాదు చేసింది రిలయన్స్‌.

wp-1477409226997.jpg

తాజగా ఈ వ్యవహరంలో మొబైల్‌ లైసెన్స్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఈ మూడు సంస్థలు పై చర్యలకు దిగింది ట్రాయ్. ఇందులో బాగంగా ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియాపై మొత్తం రూ.3,150 కోట్ల జరిమానా విధించాలని టెలికాం శాఖకు సూచించింది. మరి టెలికాం శాఖ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి.