బరువును నియంత్రించే 7 నియమాలు

tవ్యాయామాలు చేసి బరువు తగ్గటం తేలికే. కానీ అదే బరువును మెయింటెయిన్‌ చేయటమే కష్టం. అందుకు కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే…
 

క్యాలరీ కౌంటర్‌

ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే రోజుకి ఎన్ని కేలరీలు అవసరమో తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ ఇంకా ఎన్ని కేలరీలు తీసుకోవచ్చో లెక్క చూసుకుని అందుకు తగ్గట్టు డైట్‌లో మార్పులు చేసుకోవచ్చు. యాప్‌ను అనుసరిస్తూ డైట్‌ తీసుకోవటం వల్ల అదనపు కేలరీలు శరీరంలో చేరకుండా ఉంటాయి.

చెకింగ్‌ వెయిట్‌

ప్రతిరోజూ క్రమం తప్పక బరువు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే బరువు పెరిగే విషయం ఎప్పటికప్పుడు తెలుస్తుంది. బరువు తగ్గాలనుకునే ప్రారంభంలో వెయిట్‌ పెరుగుదల కనిపిస్తే నిరుత్సాహంగా అనిపించినా ఒకసారి బరువు తగ్గటం మొదలయ్యాక వెయిట్‌ చెకింగ్‌తో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 

బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరి

బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌ మానేయకూడదు. పోషకాలతో నిండిన బ్రేక్‌ఫాస్ట్‌ బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇతరత్రా జంక్‌ ఫుడ్‌ మీదకు మనసు మళ్లకుండా నియంత్రిస్తుంది.

 

నీళ్లు తాగాలి

పళ్ల రసాలకంటే నీళ్లు చక్కని ప్రత్యామ్నాయం. దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీళ్లు తాగుతూనే ఉండాలి. నీళ్లు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి బరువును అదుపులో ఉంచుతాయి.

 

కంటి నిండా నిద్ర

బరువు అదుపులో ఉండాలన్నా, పెరగకుండా ఉండాలన్నా తగినంత నిద్ర అవసరం. నిద్రాభంగం కలుగుతూ తగినంత నిద్ర పోలేకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోయేలా చూసుకోవాలి.
 

లీన్‌ మజిల్‌

మెటబాలిజం పెరగాలంటే లీన్‌ మజిల్‌ మెయింటెయిన్‌ చేయాలి. బరువులతో వర్కవుట్‌ చేయకపోతే అది ఈరోజు నుంచే మొదలుపెట్టండి. మెటబాలిజం పరుగులెత్తాలంటే వెయిట్‌ ట్రైనింగ్‌ చేయాల్సిందే.

 

టెంప్టేషన్స్‌కు దూరంగా

స్వీట్స్‌, జంక్‌ ఫుడ్‌కు లొంగకుండా ఉండగలిగితేనే బరువు అదుపులో ఉంచుకోగలం అనుకుంటారు. కానీ వాటిని పూర్తిగా మానేయాల్సి పని లేదు. అరుదుగా రుచి చూడొచ్చు. అయితే మితంగా తినాలి.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి…  

like-me