సామ్సంగ్ ఫోనులకు 14GB ఇంటర్నెట్ ను ఫ్రీ గా ఇస్తున్న ఎయిర్టెల్ [OCT 12]

సామ్సంగ్ గేలక్సీ J సిరిస్ లోని ఫోనులు వాడుతున్న అందరికీ ఎయిర్టెల్ కొత్త 4G ఇంటర్నెట్ ఆఫర్ అందిస్తుంది. 1GB(250 రూ సుమారు) కు రీచార్జ్ చేస్తే అదనంగా 14GB 4G ఇంటర్నెట్ ఇస్తుంది.
ఇది కొత్తగా ఫోన్ కొన్నవారు, ఆల్రెడీ వాడుతున్న వారికీ వర్తిస్తుంది. గతంలో ఇదే ఆఫర్ కేవలం కొత్త ఫోనులపైనే రిలీజ్ చేసింది. ఇది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ users కు మాత్రమే.
ఆఫర్ 3 నెలలు వరకూ ఉంటుంది validity. ఈ లోపు మీరు 15GB quota మించినా, మరలా రీచార్జ్ చేసుకోగలరు. maximum 3 సార్లు రీచార్జ్ అవుతుంది 3 నెలలో.
ఏలా రీచార్జ్ చేసుకోవాలి ఈ ఆఫర్ ను?

మీ వద్ద ఉన్న క్రింద తెలపడిన సామ్సంగ్ J సిరిస్ ఫోనులో బ్రౌజర్ ఓపెన్ చేసి, మొబైల్ డేటా on చేసి, offers.airtel.in అనే లింక్ ను ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీకు Activate Now అనే బటన్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే మీరు అర్హులా కాదా అని చెక్ చేసి ఒక SMS పంపిస్తుంది. ఇప్పుడు మీరు 1GB 4G మొబైల్ ఇంటర్నెట్ రీచార్జ్ చేస్తే అదనంగా 14GB పొందగలరు.
సపోర్ట్ చేసే సామ్సంగ్ J సిరిస్ ఫోనులు :
Samsung Galaxy J2 (2015) Samsung Galaxy J2 (2016)Samsung Galaxy J5 (2015) Samsung Galaxy J5 (2016)Samsung Galaxy J7 (2015)Samsung Galaxy J7 (2016)Samsung Galaxy J2 Pro మరియు Samsung Galaxy J Max

4G సిగ్నల్స్/ఏరియాస్ లో లేని వారికి.. అదనంగా వచ్చే 14GB డేటా కేవలం అర్థరాత్రి 12 నుండి ఉదయం 6 వరకూ మాత్రమే వాడుకోగలరు.

Category:

Tech news