బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. బాహుబలి 2 కూడా అదే ఒరవడిని కొనసాగించనుందా?. అంటే అవునంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. వచ్చే ఏడాది ఏప్రిల్ 28న  విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి అప్పుడే జోరుగా బిజినెస్ సాగుతోంది. ప్రీ బిజినెస్ మొత్తం 400 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.

అన్నీ కలుపుకుని ఈ మొత్తం వస్తుందని అంచనా వేస్తున్నారు.. పలు భాషల్లో హక్కులు దక్కించుకునేందుకు ఇఫ్పటికే చాలా మంది రంగంలోకి దిగారు. బాలీవుడ్ లో అయితే బాహుబలి2ని కరణ్ జోహర్ హక్కులు తీసుకోనున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి వరస పెట్టి బాహుబలి 2కి సంబంధించిన ప్రచార కార్యక్రమంలో హోరెత్తనుంది

. తాజాగా రానా బాహుబలి కోసం పెంచిన కండలతో కూడిన ఫోటోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన వారంతా బాబోయ్ ఇవేమీ కండలు అని భయపడేలా ఉన్నాయి. ఇదంతా ఒకెత్తు అయితే ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 వసూళ్ళు ఎంత ఉంటాయనే అంచనాలు మొదలయ్యాయి. తొలి భాగం 650 కోట్ల రూపాయలను వసూలుచేసిన సంగతి తెలిసిందే.

దీంతో బాహుబలి 2 సినిమా వసూళ్ళు  సుమారు 1000 కోట్ల రూపాయలు దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కనుగ జరిగితే దేశ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులు అన్నీ కకావికలం కావటంతో పాటు ఈ రికార్డును అందుకోవటానికి కూడా నానా కష్టాలు పడాల్సి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి బాహుబలి 2 ఎన్ని రికార్డులునెలకొల్పుతుందో.

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.