సమంత మళ్ళీ మొదలెట్టింది

c2i_2392016172316
‘జనతా గ్యారేజ్‌’ తర్వాత కొత్త సినిమా ఏదీ ఒప్పుకోలేదు సమంత. ఎప్పుడూ ఆన్ అండ్ అఫ్ లో ఏదో షూటింగ్ లో వుండే సమంత.. జనతా గ్యారేజ్ తర్వాత మాత్రం గ్యాప్ తీసుకుంది. అయితే ఇప్పుడు బ్రేక్ టైమ్ ముగిసింది. మళ్ళీ కెమరా ముందుకు వచ్చేసింది సమంత.

విశాల్‌ హీరోగా ‘ఇరుంబు తిరై’ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడీ సెట్స్ లో అడుగుపెట్టింది సమంత. ఈ విషయాన్ని సమంత స్నేహితురాలు, డిజైనర్‌ నీరజా కోనా తన ట్విట్టర్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా సమంతతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకుంది. పి.ఎస్‌. మిత్రన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. విశాల్‌ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. విశాల్ తో జోడి కట్టడం సమంతకు ఇదే తొలిసారి.

ఇక సమంత విషయానికి వస్తే.. హీరో అక్కినేని నాగచైతన్యతో ఆమె వివాహం ఖరారైయింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో వున్న ఈ జంట వచ్చే ఏడాది వివాహంతో ఒక్కటికాబోతున్నారు. ఇప్పటికే ఇరువురూ ఈ విషయాన్ని దృవీకరించారు.