సదర్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న రూ.11 కోట్ల దున్నపోతు.

c2i_309201615251

సంవత్సరానికి కోటి రూపాయలకి పైగానే సంపాదిస్తున్న ఈ దున్నపోతు పేరు యువరాజ్, దీనిని హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామానికి చెందిన కరమ్ వీర్ సింగ్ అనే వ్యక్తి పెంచుతున్నాడు, సంవత్సరానికి కోటి రూపాయలకి పైగా ఆదాయం తెచ్చిపెడుతున్న ఈ దున్నపోతు విలువ రూ.11 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో రికార్డులని సృష్టించిన యువరాజ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరిగే సదర్ పండుగ ఉత్సవాలకి వస్తున్నాడు.

51476487

దీపావళి ఉత్సవాలలో భాగంగా సదర్ పండుగని దీపావళి తరువాతి రెండు రోజులు నిర్వహిస్తారు, హైదరాబాద్ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా ఈ వేడుకలని నిర్వహిస్తున్నారు, ఈ ఉత్సవాలని యాదవులు మాత్రమే జరుపుకుంటారు, పవన్ కళ్యాణ్ జానీ సినిమాలోని ఒక పాటలో “సదర్ పండుగా వచ్చిందా..! పట్నంలో మనవాళ్ళు దున్నపోతులని ఆడిస్తూ దిల్ ఖుషిలు చేస్తారు” అని ఉంటుంది, ఆ పాటలో ఉన్నట్లుగానే ఈ పండుగని చాలా వైభవంగా నిర్వహిస్తారు, దున్నపోతులని అందంగా అలంకరిస్తారు, అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం. ఈసారి వేడుకలలో ఈ యువరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.

యువరాజ్ ప్రత్యేకతలు:

దీని ఎత్తు : 6 అడుగులు. పొడవు : 14 అడుగులు, బరువు : 1800 కిలోలు.విలువ రూ.11 కోట్ల రూపాయలు.యువరాజ్ ఆహారం : రోజుకు 15కిలోల యాపిల్స్, 30 లీటర్ల పాలు, ఐదు కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, ఐదు కిలోల బెల్లం, దానా, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు, మొక్క జొన్న పొట్టు.వ్యాయాయం కోసం ప్రతిరోజూ యువరాజ్ ని ఐదు కిలోమీటర్లు నడిపిస్తారు.దున్నపోతు యువరాజ్ వీర్యానికి విదేశాల్లో మంచి డిమాండ్. వీర్యం ద్వారానే ఇది ఏడాదికి కోటి రూపాయలు ఆదాయం తీసుకొచ్చిపెడుతుంది.యువరాజ్ సంరక్షణ కోసం ఎల్లప్పుడూ 10 మంది యువకులు పనిచేస్తుంటారు.

yuvrajbuffalo_650x425_032016111416
హర్యానా నుండి హైదరాబాద్ కి (1800 కిలోమీటర్లు) ఏసీ కంటైనెర్ లో తీసుకొస్తున్నారు, 2015 లో జరిగిన సదర్ ఉత్సవాలకి కూడా ఈ యువరాజ్ ని తీసుకొచ్చారు, ఈసారి ఉత్సవాలకి యువరాజ్ తో పాటు యువరాజ్ కుటుంబసభ్యులని కూడా తీసుకొస్తున్నారు.

baffelo8_1449767727_14498

ఈ నెల 31 న ముషీరాబాద్ లో, నవంబర్ 1 న నారాయగూడలో ఎడ్ల హరిబాబు యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు జరగనున్నాయి, ఈ ఉత్సవాలని మరియు యువరాజ్ ని చూసేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.