శరీర బరువు తగ్గించే ఆహార పదార్థాలు

telugu-wight-loss-tipsకొన్ని సార్లు జిమ్ లేదా వ్యాయామాలు చేసినప్పటికీ బరువు తగ్గరు. కారణం తీసుకునే ఆహార పదార్థాలు, ఇక్కడ తెలిపిన ఆహారాలను మీ ప్రణాళికలో కలుపుకొండి, ఎందుకంటే ఇవి మీ బరువు తగ్గించే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి.

బరువు తగ్గించే ఆహార పదార్థాలు
ప్రస్తుతకాలంలో చాలా మంది అధిక బరువుతో భాదపడుతున్నారు. జిమ్, వ్యాయామాలు మరియు యోగ వంటివి మాత్రమే కాదు, ఆహార పదార్థాలు కూడా ముఖ్యమే. కొన్ని ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గే ప్రక్రియను రెట్టింపు చేస్తాయి. ఆహార పదార్థాలు శరీర బరువు తగ్గించటం ఏంటని చాలా మంది నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం! కొన్ని ఆహార పదార్థాలు శరీర జీవక్రియను రెట్టిపు చేసి, హార్మోన్ ల విడుదలను అధికం చేసి బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఆ ఆహార పదార్థాలేంటో ఇక్కడ పేర్కొనబడింది.

బాదం

నట్స్ లు కొవ్వు మరియు కేలోరీలను అధికంగా కలిగి ఉంటాయి, కావున బాదంలు శరీర బరువు తగ్గిస్తాయని చెప్తే నమ్మటానికి ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ ఇది ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. బాదం నుండి కొవ్వు, ఫైబర్, నాణ్యత గల పోషకాలు వంటి విటమిన్ ‘E’ మరియు కాల్షియం వంటి పోషకాలు శరీరానికి అందించబడతాయి. కానీ బాదంలను పరిమిత స్థాయిలో మాత్రమే తీసుకోవాలి.

bhadam

హోల్ గ్రైన్స్

బరువు తగ్గే విషయానికి వస్తే, హోల్ గ్రైన్స్ ను మీ ఆహార ప్రణాళికలో కలుపుకోవటం ఉత్తమ చిట్కాగా పేర్కొనవచ్చు, ఇవి శరీరంలో కేలోరీలను కరిగించుటలో సమర్థవంతంగా పని చేస్తుంది.

Close up of assorted grains and bread


కొబ్బరి నూనె

కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. వీటిలో ఉండే మధ్యతరహ:- గొలుసు ట్రైగ్లిసరైడ్ లు జీవక్రియను పెంచి, శక్తి వినియోగాన్ని రెట్టింపు చేస్తాయి. కావున బరువు తగ్గించుకోవాలనుకునే వారు వారు తినే ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వాడండి.

coconut-and-coconut-oil


మిరియాలు

మిరియాలు మన శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మిరియాలు “క్యాప్సైసిన్” అనే సమ్మేళనాలను కలిగి ఉండి, ఆక్సిడేషన్ అనే ప్రక్రియ ద్వారా శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను కరిగిస్తాయి. అంతేకాకుండా, జీవక్రియను పెంచటం ద్వారా కేలోరీలను వినియోగించేలా చేస్తాయి.

blackpepper

ద్రాక్షపండ్లు

ద్రాక్షపండ్లు కొవ్వు కరిగించే అద్భుత ఆహార పదార్థాలుగా చెప్పవచ్చు. ఇది జీవక్రిను పెంచి మరియు శరీరంలో అదనంగా ఉండే కొవ్వు పదార్థాలను వినియోగించేలా చేస్తుంది. అంతేకాకుండా, ఈ పండ్లు ఫైబర్ లను కలిగి ఉండి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించేలా చేస్తాయి.

green-grapes

నచితే షేర్ చేయండి ఫ్రెండ్స్