లీక్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి క్లైమాక్స్!

wp-1477641324591.pngనందమూరి బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ అత్యంత వేగంగా జరుగుతున్న నేపధ్యం తెలిసిందే.  అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాకు క్లైమాక్స్ ఏ విధంగా చిత్రీకరించి ఈసినిమా ముగింపు చూపెట్టాలి అని మధన పడుతున్న క్రిష్ ఆలోచనలకు పరిష్కారం దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే క్రిష్ మైండ్ లో ఈసినిమాను రెండు విధాలుగా ముగించాలి అన్న ఆలోచనలతో రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించాడు అన్న వార్తలు ఉన్నాయి.  దానిలో మొదటిగా ఈసినిమా చివర్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మరణంతో ఈసినిమాను ముగించడం.  అయితే ఆ ముగింపు బాలకృష్ణ అభిమానులకు ఏ మాత్రం నచ్చదు అన్న ఉద్దేశ్యంతో క్రిష్ ఈసినిమాకు ఒక వినూత్నమైన ఎండింగ్ సీన్ ను క్రియేట్ చేసినట్లు టాక్.

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితంలో చేసిన యుద్ధాలలో అత్యంత చిరస్మరణీయమైన భీకర యుద్ధంతో ఈసినిమా ముగింపు చేస్తారని టాక్. ఈయుద్ధం తరువాత శాతకర్ణి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిరోహించిన సీన్ చూపెట్టి ఆ తరువాత వెంటనే భారత స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన కొన్ని సీన్స్ ను చూపెట్టి ఆ తరువాత మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు చూపించి జాతీయ పతాకం రెపరెపలాడుతున్న షాట్ తో ఈసినిమాను ఎండ్ చేస్తారని వార్తలు వస్తున్నాయి.

ఈసినిమా క్లైమాక్స్ లో యుద్ధ సన్నివేశం పూర్తి అయ్యాక బాలకృష్ణ చెప్పే డైలాగ్స్ ఈసినిమాకు ప్రధాన ఆకర్షణగా మారుతుందని అంటున్నారు. ఈసన్నివేశంలో బాలయ్య నోటివెంట ఆంధ్రుల గొప్పతనం గురించి ఖ్యాతి గురించి చెప్పే ఉత్తేజ పూరితమైన డైలాగ్స్ ఉంటాయని టాక్. ఈసినిమా క్లైమాక్స్ లో వచ్చే యుద్ధం 20 నిముషాలు ఉండటమే కాకుండా అత్యంత భారీ స్థాయిలో గ్రాఫిక్స్ కూడ ఉంటాయని తెలుస్తోంది.

ఇప్పటి వరకు బాలకృష్ణ నటించిన ఏ సినిమాలోను లేని విధంగా ఉద్వేగ భరితంగా బాలకృష్ణ ఈసినిమాలో నటించాడు అంటూ ఈ సినిమా రషస్ చూసినవారు అంటున్నారు. ఈ విషయాలన్నీ ఇలా బయటకు వస్తూ ఉండటంతో ఇప్పటి వరకు విడుదలైన బాలకృష్ణ సినిమాల మార్కెట్ స్థాయిని దాటి ఈసినిమాకు జరుగుతున్న బిజినెస్ టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది..