మీ శరీరం గురించి మీకు తెలియని అద్దిరిపోయే విషయాలు!

img_20161103_065522మానవ శరీరంలో మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు..!!

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

1. తెలుసు. చర్మంపైన బాక్టీరియా విడుదల చేసే వ్యర్థాలు చెమటతో కలవడం వల్ల ఈ వాసన వస్తుంది.

2. మెదడు ముడతలుముడతలుగా ఉన్న ఓ అవయవం వంటిది. ఆ ముడతలను తొలగిస్తే అది ఓ దిండు సైజులో ఉంటుంది.

3. అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తొలగించాల్సి వచ్చిన ఏ బాధ లేదు. ఎందుకంటే అది మళ్లీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమయినంత మేరకు దానికదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్ని సార్లు తొలగించినా పెరుగుతూనే ఉండటం వింతేకదా మరి.

4. గోళ్లను, వెంట్రుకలను కత్తిరించినా నొప్పి పుట్టదు. కారణం ఆ రెండింటిలోనూ కెరాటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది.

5. ప్రపంచంలోని 10శాతం పురుషులు, 8శాతం స్త్రీలు ఎడమ చేతివాటం కలిగి ఉంటారు.

6. ఎక్కువగా శ్రమపడే వ్యక్తి నుంచి ప్రతీరోజూ 4 గ్యాలన్ల చెమట విడుదలవుతుంది. ఒక గ్యాలన్ 3.7 లీటర్లకు సమానం. ఈ లెక్కన ప్రతీరోజూ సుమారు 15 లీటర్ల చెమట ఓ కష్టజీవి నుంచి విడుదలవుతుంది.

7. మానవ శరీరంలో సుమారు 5 లక్షల టచ్ డిటెక్టర్స్ ఉంటాయి. అందుకే ముట్టుకున్న వెంటనే తెలిసిపోంతుంది.

8. నిద్ర కరువయినా మనిషి చనిపోతారు. కాకుంటే దీనికి కనీసం వారం పదిరోజులు పడుతుంది.

9. రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయండి..!!

10. మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె… మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

11. నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

గ్యాస్ స్టవ్ సరిగ్గా కట్టేసారో లేదో చూసుకోండి..!!

12. మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో… చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

13. ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

ప్రపంచంలో ఉన్న బెస్ట్ కెమెరా మీ దగ్గరే ఉంది.!!

14. మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

15. మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

మీకు ఈ పోస్టు కనుక నచ్చితే షేర్ చేయడం మరువకండి..