మీ ముఖంపై కలిగే మార్పులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తాయి

health-telugu

నుదుటి పైన గీతాలు- జీర్ణ సమస్యలను కలిగి ఉన్నారని సూచిస్తుంది.
సిగరెట్ తాగటం వలన నోటి చుట్టు వృద్దాప్య గీతలు ఏర్పడతాయి.
చెవులు దురదలు- చికాకులకు సంకేతం.
నుదుటిపై మొటిమలు కాలేయం & కడుపు రద్దీగా ఉన్నాయని సూచిస్తుంది.

ఆఫీసుకు లేదా మీ పనికి వెళ్ళే ముందు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నారా? అవును ప్రతి ఒక్కరు తప్పక చూసుకుంటారు. కానీ, మీ శరీరంలో ఏర్పడే ఆరోగ్య సమస్యల గురించి మీ ముఖం ఎల్లపుడు తెలియచేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవును ఇది నిజమే!. మీలో కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఎల్లపుడు ముఖం ఏదొక రకంగా, మార్పుల ద్వారా తెలియచేస్తూనే ఉంటుంది. నమ్మకం కలగట్లేదా! అయితే ఇక్కడ తెలిపిన మార్పులు మీ ముఖంపై కలిగితే, దానికి సంబంధించిన దుగ్మతలు కలిగి ఉన్నారని అర్థం.
faa
నుదుటిపై గీతలు
నుదుటిపై గీతలు లేదా లైన్స్ ఏర్పడుతున్నాయా! అయితే మీరు జీర్ణాశయ సమస్యలతో భాదపడుతున్నారని అర్థం. చింతించకండి. ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వేడి నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకొని, రోజు ఉదయాన తాగటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
వృద్దాప్య రేఖలు లేదా ఏజింగ్ లైన్స్
నిజానికి, సిగరెట్ తాగటం వలన నోటి చుట్టూ వృద్దాప్య రేఖలు లేదా ఏజింగ్ లైన్స్ ఏర్పడతాయి. ఈ రేఖలు కనపడకుండా ఉండటానికి, సిగరెట్ తాగటాన్ని తగ్గించాలి లేదా పూర్తిగా మానేయాలి. అంతేకాకుండా, ప్రతిరోజు లిప్ బామ్ లను అప్లై చేస్తూ ఉండటం వలన పెదాలు మరియు వాటి చుట్టూ ప్రాంతం సున్నితంగా మారి, యవ్వనంగా కనపడుతుంది.
నుదుటిపై మొటిమలు
కాలేయం మరియు పొట్టలో సమస్యలు కలగటం వలన నుదుటిపై మొటిమలు ఏర్పడతాయి. శరీరంలో ఉండే హానికర కారకాలను తొలగించటానికి అధిక మొత్తంలో నీటిని తాగండి. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరియు ఒత్తిడి ఏర్పరచని ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. పచ్చని ఆకుకూరలు మరియు పండ్లు వంటిని తింటూ, సంవిధానపరచిన ఆహారాలకు, కాఫీకి దూరంగా ఉండటం వలన ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
fa
చెవుల దురదలు
మీ చెవులు దురదలుగా అనిపిస్తున్నాయా! అయితే మీరు అలర్జీ లేదా సహనాన్ని తక్కువగా కలిగి ఉన్నారని అర్థం. విటమిన్ ‘D’ లోపల వలన వ్యక్తిలో “సోరియాసిస్” మరియు “తామర” వంటి చర్మ వ్యాధులు కలుతాయి. కావున, ఈ విటమిన్ ను పొందుటకు రోజు ఉదయాన మీ చేతులను, ముఖాన్ని సూర్యకాంతిలో ఉంచండి.
కంటి కింద నల్లటి వలయాలు
మీ కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయా? అయితే సరైన సమయం పాటూ నిద్ర, విశ్రాంతి తీసుకోవటం లేదని మరియు సరైన సమయం స్థాయిలో ఆహారం తీసుకోవట్లేదని అర్థం. ఈ సమస్య నుండి ఉపశమనం పొందటానికి, పాలు ఉత్పత్తులను వీట్ ఉత్పత్తులను మీ ఆహార ప్రణాలికల నుండి తొలగించండి. వీటితో పాటూ ఆల్కహాల్ కు కూడా దూరంగా ఉండటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
దవడలపై మొటిమలు
శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గటం వలన చర్మం మెరుపుదనాన్ని కోల్పోయి, మొటిమలు అభివృద్ధి చెందుతాయి. సాధారణంగా, ఈ రకం చర్మ సమస్యలు వృద్ధ మహిళలలో గమనించవచ్చు. ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి గానూ, ఆప్రికాట్లు, చిలకడదుంప మరియు మామిడికాయలను తినటం వలన చర్మ కణాలలో సహజంగా విటమిన్ ‘A’ ఉత్పత్తి అధికం చేస్తాయి.

కావున, ముఖంలో కలిగే ఈ మార్పులను మరియు లక్షణాలు గమనించి, తగిన చర్యలను పాటించి, ఆరోగ్య సమస్యలను తగ్గించుకొని, చర్మ రూపును మెరుగుపరచుకోండి.