మీ ఫోన్‌ ఇంటర్నెట్‌ ప్యాక్ తొందరగా అయిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

wp-1477965521758.jpg
ఇంటర్నెట్‌ బ్యాలెన్స్‌ ఉందంటే చాటింగ్‌, బ్రౌజింగ్‌, గేమింగ్‌, వీడియో స్ట్రీమింగ్‌.. ఇలా అనేక రకాలుగా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతుంటాం. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో ఎక్కువ ఇంటర్నెట్‌ డేటాను ఖర్చు చేస్తుంటాం. డేటా అయిపోగానే నిరుత్సాహం చెందుతుంటాం. అయితే… ఫోన్‌ ఇంటర్నెట్‌ డేటాను 80 శాతం ఆదా చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే…
ప్రయాణ సమయంలో ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయకండి.
– గూగుల్‌ మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో మాత్రమే వాడుకోండి.
– ఫేస్‌బుక్‌ ఆండ్రాయిడ్‌ వర్షన్‌ యాప్‌తో పోలిస్తే వెబ్‌ వర్షన్‌ యాప్‌ తక్కువ ఇంటర్నెట్‌ డేటాను ఖర్చు చేసుకుంటుంది.
– క్రోమ్‌ బ్రౌజర్‌ మీకు డీఫాల్ట్‌ గా ఉన్నట్లయితే అందులోని డేటా సేవర్‌ ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోండి. ఇలా చేయటం వల్ల వెబ్‌ పేజెస్‌ కంప్రెస్‌ అవుతాయి.
– ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌ గేమ్స్‌ ట్రై చేయండి.
– గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Auto-Updating Apps ఆప్షన్‌ను డిసేబుల్‌ చేయండి. ఇలా చేయడం వల్ల మీకు అవసరమైనప్పుడు మాత్రమే యాప్స్‌ను అప్‌డేట్‌ చేసుకునే వీలుంటుంది. తద్వారా బోలెడంత మొబైల్‌ డేటా ఆదా అవుతుంది. – ఆన్‌లైన్‌ మ్యూజిక్‌కు బదులుగా

ఆఫ్‌లైన్‌ మ్యూజిక్‌కు ప్రాధాన్యత ఇవ్వండి.
మీ ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ ఫోన్‌లో ఏయే అప్లికేషన్‌ ఎంతెంత డేటాను ఖర్చు చేస్తుందో ట్రాక్‌ చేయండి. తద్వారా మీ మొబైల్‌ డేటా పై అవగాహనకు రావచ్చు. అవసరం లేని యాప్‌ను డిసేబుల్‌ చేయటం ద్వారా డేటా వినియోగాన్ని కొంత మేర ఆదా చేసుకోవచ్చు.
వాట్సాప్‌లోని ఆటో – డౌన్‌లోడ్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేయండి. చాలా మంది వాట్సాప్‌ యూజర్లు ఇతర గ్రూప్‌లలో భాగంగా ఉండటం వల్ల తరచూ ఫొటోలు, వీడియోలు, ఆడియోలను రిసీవ్‌ చేసుకుం టుంటారు. అయితే.. వీటిలో వాళ్లకు అవసరంలేనివి చాలానే ఉంటాయి. ఈ మల్టిఫుల్‌ ఫార్వర్డ్‌లను రిసీవ్‌ చేసుకోవటం వల్ల డేటా ఖర్చవుతూనే ఉంటుంది. కాబట్టి మీ వాట్సాప్‌ అకౌంట్‌లోని ఆటో డౌన్‌లోడ్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేసుకోవటం వల్ల డేటా వినియోగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.
అప్లికేషన్‌లను పరిమితం చేయండి మీ ఫోన్‌లో ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్న అప్లికేషన్‌లను పరిమితం చేయండి. Settings లోకి వెళ్లి చూసినట్లయితే ఏ యాప్‌ ఎంతంత డేటాను ఖర్చు చేస్తుందో అర్థమవుతుంది.