మన మధ్య ఉన్న చార్మినార్ వెనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్నాయి

googleక్రీ.శ.15వ శ‌తాబ్దంలో గోల్కొండ నుంచి  ప్రస్తుత హైదరాబాదు నగరానికి తమ‌ రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత  హైదరాబాద్‌లో ప్లేగు (గత్తర) వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థకంగా అద్భుతమైన‌ కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి. క్రీ.శ.1592లో కులీ కుతుబ్ షా నాలుగు గోపురాలతో కూడిన అందమైన చార్మినార్  నిర్మించాడు.  మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సం.లో ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా ఈ క‌ట్ట‌డాన్ని నిర్మించినాడు.



చార్మినార్‌లోని ‘చార్‌’ల అద్భుతం: 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు ‘చార్‌’తో విడదీయరాని బందం ఉంది. నాలుగు మీనార్‌(గోపురాలు)లతో నిర్మితమై ఉండడం వ‌ప‌న  దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిన విష‌యం అంద‌రికి తెలుసు. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అనుఅనువునా ‘నాలుగు’ దాగి ఉందనేది అందరకీ తెలియని ర‌హాస్యం. చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది.  చార్మినార్ కి ఆ పేరుపెట్టడానికి మరో ఇరువై రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం క‌లుగుతుంది. చార్మినార్‌ కు నలువైపులా వున్న 40 ముఖాల కొలతలు 4తో భాగించే విధంగా నిర్మించం జ‌రిగింది. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి  సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే 4 మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా 4తో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం 4 రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. ఇండియాలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. ఈ చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం కూడా 840 చదరపు గజాలు. ప్రతి మినార్ (గోపురం)లోను నాలుగు గ్యాలరీలను క‌లిగి ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో ఇరువై ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చీలు ఉన్నాయి. ఈ నిర్మాణంలో ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే సంఖ్య 44 దీనిని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాకుండా చార్మినార్‌క‌ట్ట‌డంలోని ప్రతి కొలతలో కూడా 4 అంకె ఖ‌చ్చితంగా కనిపిస్తుంది. ఆర్కియాలజీ మ‌రియు మ్యూజియం శాఖ పరిశోధకులు ఈ కట్టడానికి చార్మినార్  పెట్టటానికి అనేక కారణాలు వెలుగు చూశాయి

img_20161106_110030