బ్యాంక్‌కు.. ఆ బిచ్చగాడు ఎంత డబ్బు తెచ్చాడో తెలుసా?

wp-1479217661843.jpg
ఒక బిచ్చగాడు.. బ్యాంకుకు ఎంత డబ్బుతో వెళ్తాడు. వీలయితే వందలు, మహా అయితే వేలు. అది కూడా పదో పరకో. కానీ, ఈ బిచ్చగాడు మాత్రం ఏకంగా రూ. 50 లక్షల రూపాయలతో బిచ్చగాడి వేషంలోనే బ్యాంకులో దిగిపోయాడు. దీంతో ఆ బ్యాంకులో ఉన్న ఇతర ఖాతాదారులు, అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఈ సంఘటన తెలంగాణలోని వికారాబాద్ పట్టణంలో జరిగింది. ఒక బిచ్చగాడు తన దగ్గర ఉన్న రూ.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. అప్పటిదాకా క్యూలో నిల్చున్న తనను చీదరించుకున్న తోటి ఖాతాదారులకు షాక్ ఇస్తూ ఆ బిచ్చగాడు ఒక్కసారిగా రూ. 50 లక్షలు బయటకు తీశాడు. ఆ డబ్బును తన ఖాతాలో జమ చేయాల్సిందిగా బ్యాంకు అధికారులను అడిగాడు. షాక్ నుంచి తేరుకున్న అధికారులు అంత డబ్బును ఒకేసారి జమ చేయాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి అని చెప్పారు.

wp-1479217760926.jpg
ఇంకేముంది ఆ బిచ్చగాడు మరో జేబులోంచి పాన్ కార్డ్ తీయడంతో అధికారుల, ఖాతాదారుల మైండ్ బ్లాక్ అయిందట. అయినా, ఆ డబ్బును అతడి ఖాతాలో జమ చేయకుండా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. తన రెండెకరాల పొలాన్ని రెండు నెలల క్రితం అమ్మానని, ఆ డబ్బే ఇదని చెప్పడంతో, దానికి సంబంధించిన పత్రాలు చూపించాలని అధికారులు కోరడంతో తీసుకొస్తానని ఆ బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.