ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలు

c2i_239201613498టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఆలిండియా స్టార్‌ హీరోగా మారిపోయాడు. ఒక్క ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగి పోయింది. ‘బాహుబలి’ సినిమాకు ముందు ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ సినిమా 40 కోట్లు వసూళ్లు చేస్తేనే సంచలనం. ఆ తర్వాత ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’ సినిమా దాదాపుగా 650 కోట్ల వసూళ్లను సాదించింది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ప్రభాస్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

2002లో ‘ఈశ్వర్‌’ చిత్రంతో ప్రభాస్‌ తెరంగేట్రం చేశాడు.
మొదటి సినిమాతో కృష్ణంరాజు నట వారసుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమా ప్రభాస్‌కు ఏమాత్రం గుర్తింపు తీసుకు రాలేదు. రెండవ సినిమా రాఘవేంద్ర కూడా కృష్ణంరాజు వారసుడిగానే చేశాడు. ఆ సినిమా మరింత దారుణం. అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.
ప్రభాస్‌ మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌ అవ్వడంతో అతడిపై ప్రేక్షకుల్లో నమ్మకం సన్నగిల్లింది. కృష్ణంరాజుకు వారసుడు అయ్యేంత సీన్‌ ప్రభాస్‌కు లేదు అని అంతా భావించారు. ఆ సమయంలోనే ‘వర్షం’ చిత్రంతో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
వర్షం సినిమాతో ప్రభాస్‌కు ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్‌ వచ్చింది.
‘వర్షం’ తర్వాత మళ్లీ రెండు ఫ్లాప్‌లు. దాంతో మళ్లీ ప్రభాస్‌పై అనుమానాలు. ఆ సమయంలోనే ‘చత్రపతి’ సినిమా వచ్చింది. ఆ సినిమా ప్రభాస్‌ను మళ్లీ వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండా చేసింది.
‘చత్రపతి’ తర్వాత కూడా పలు ఫ్లాప్‌లు వచ్చినా కూడా ప్రభాస్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరోగానే దూసుకు పోయాడు.
‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘డార్లింగ్‌’, ‘మిర్చి’ చిత్రాలతో ప్రభాస్‌ సక్సెస్‌లు దక్కించుకున్నాడు.
2013లో వచ్చిన ‘మిర్చి’ సినిమా తర్వాత ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటించాడు. ప్రస్తుతం ప్రభాస్‌ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
‘బాహుబలి’ రెండవ పార్ట్‌ పూర్తి చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు. బ్యాచ్‌లర్‌గా ఇదే చివరి బర్త్‌డే అంటూ ప్రభాస్‌ సన్నిహితులతో చెబుతున్నాడు.
‘బాహుబలి’లాంటి సినిమాలు మరిన్ని చేసి టాలీవుడ్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ప్రభాస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నాం.

తప్పకుండా షేర్ చెయ్యగలరు