పవన్ కళ్యాణ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు

c2i_249201615943
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కాటమరాయుడు సెట్స్‌పైకి వెళ్లే విషయంలో చాలా ఆలస్యం చోటు చేసుకొంది. అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మొదట దర్శకుడు మారిపోయాడు. ఆ తర్వాత స్క్రిప్టులోనూ మార్పులు జరిగాయి.  ఎస్.జె.సూర్య స్థానంలో డాలీ వచ్చాక స్క్రిప్టులో చాలా మార్పు చేర్పులు చేసినట్టు సమాచారం. అందుకోసం కొంచెం సమయం తీసుకొన్నారు. తీరా  అన్నీ సిద్ధమయ్యాక పవన్ పాలిటిక్స్ వల్ల మరికాస్త జాప్యం జరిగింది. అయితే సినిమా పట్టాలెక్కే విషయంలో అలా ఆలస్యమైందేమో కానీ… విడుదల విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. అందుకే రిలీజ్ డేట్‌ని కూడా ఫిక్స్  చేసేశారు.

dc-cover-thno7behris6eaeii5t09kmr16-20160419233151-medi

వచ్చే యేడాది మార్చి 29న ఉగాదిని పురస్కరించుకొని చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దర్శకనిర్మాతలు ఆ డేట్‌ని లాక్ చేసేసి మీడియాకి తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచన మేరకే అలా ఫిక్స్ చేశారట. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ – శ్రుతిహాసన్ లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి లోపు షూటింగ్ ని పూర్తి చేయాలని పవన్ కంకణం కట్టుకొన్నాడట. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటించాల్సి వుంది కాబట్టి పవన్ పక్కాగా ప్లానింగ్ సెట్ చేసినట్టు తెలిసింది.