జియో సిమ్‌ తీసుకునే వారికీ హెచ్చరిక..

wp-1477149699318.jpg

జియో ప్రకటించిన ఆఫర్స్ తో వినియోగదారులు ఈ సిమ్ ల కోసం ఎంతో కష్టపడి పోతున్నారు..అందుకోసమని రిలయన్స్‌ జియో సిమ్‌లను కొన్ని వెబ్‌సెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా వినియోగదారులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిమ్ లకోసం చేయాల్సిందల్లా కేవలం వాళ్లు ఏర్పరచిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌లో మన పేరు, అడ్రసు, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీలను పొందుపరిస్తే చాలు. దరఖాస్తు చేసిన ఏడు నుంచి పదిరోజుల్లోపు కేవలం రూ.199ల డెలివరీ రుసుముతో జియోసిమ్‌లను ఇంటికి తెచ్చిస్తామని ఆ వెబ్‌సైట్లు ప్రకటిస్తున్నాయి. ఈ సిమ్ లతో పాటు రూ.1,999కే రిలయన్స్‌ జియో డోంగిల్‌, రూ.2,199కే రిలయన్స్‌ వైఫై డోంగిల్‌లను అందిస్తున్నామని సైట్లు ప్రకటించాయి.

వాస్తవానికి జియో కేవలం సిమ్ లు మాత్రమే ఇస్తుంది తప్ప , మిగతావేమి ప్రకటించలేదు. కొన్ని నకిలీ వెబ్‌సైట్లు వాట్సప్‌, ఈమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈ అమ్మకాలు జరుపుతున్నాయి. సిమ్‌ డెలివరీ సమయంలో వారు సేకరిస్తున్న అడ్రస్‌, గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో వంటి పూర్తి వివరాలను సేకరిస్తున్న ఈ వెబ్‌సైట్లు మనకు ప్రమాదాల్ని తెచ్చిపెట్టవచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌ వినియోగదారులు ఇది గమనించి అటువంటి మోసపూరితమైన వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు