జనం కష్టాలు తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వినూత్న నిర్ణయం

wp-1479123165942.jpgపెద్ద నోట్ల రద్దుతో జనం కష్టాలు ఎదుర్కొంటోన్న తరుణంలో వారి ఇబ్బందులు తొలగించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీకి హెలికాఫ్టర్ల ద్వారా కొత్త నోట్లను తరలిస్తోంది. బొకారో నగరంలోని బ్యాంకులు, ఏటీఎంలకు నగదును ఈ హెలికాఫ్టర్ల ద్వారా తరలిస్తున్నారు. వాస్తవానికి ప్రకృతి విపత్తుల సమయంలో, అత్యవసర సమయాల్లో హెలికాఫ్టర్లను వాడుతుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం నోట్లకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో రిజర్వ్ బ్యాంక్ హెలికాఫ్టర్ ద్వారా కొత్త నోట్లను, కరెన్సీని తరలించింది.

wp-1479123510489.jpg

wp-1479123545754.jpg