కొత్తనోట్ల కోసం బ్యాంకుకు వచ్చిన ప్రధాని తల్లి!

wp-1479262834217.jpgనోట్లరద్దుతో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కూడా బ్యాంకు ముందు నిలబడ్డారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని ఓ బ్యాంకుకు వచ్చారు. ఓ చేతిలో కర్ర, మరో చేతిలో పాత నోట్లను పట్టుకుని కనిపించారు. ప్రధాని తల్లే అయినా ఆమెకు కూడా బ్యాంకు ముందు నిలబడే తిప్పలు తప్పలేదు. 95 ఏళ్ల హీరాబెన్ క్యూలైన్‌లో నిలబడేసరికి కొందరు మహిళలు, కుటుంబసభ్యులు ఆమెకు సహాయం చేశారు. బ్యాంకులోపలికి తీసుకెళ్లి కొత్త నోట్లను ఇప్పించారు.

wp-1479263138640.jpg