కాటమరాయుడు గురించి షాకింగ్‌ విషయం

pawan

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. డాలీ దర్శకత్వంలో ఈ సినిమాను పవన్‌ సన్నిహితుడు శరత్‌ మారార్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. దాంతో పవన్‌ కళ్యాణ్‌ ఈ సినిమాలో కాస్త ఎక్కువ ఏజ్‌గా, డీ గ్లామర్‌గా కనిపిస్తాడని అంతా భావిస్తున్నారు. అయితే సినీ వర్గాల వారిని మరియు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపర్చేలా ఈ సినిమాలో పవన్‌ మరో లుక్‌ ఉంటుందని అంటున్నారు.
wp-1477478326051.jpg ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా, కాస్త ఏజ్‌ ఎక్కువ ఉన్న వ్యక్తిగా, లీంగీలో కనిపిస్తూనే మరో పాత్రలో చాలా స్టైలిష్‌గా కనిపించబోతున్నాడు. రెండు విభిన్న గెటప్స్‌లలో పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తాడు అని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రెండు విభిన్న గెటప్స్‌లలో కూడా పవన్‌ వారెవా.. అనిపించుకుంటాడు అని ఈ సందర్బంగా పవన్‌ సన్నిహితులు చెబుతున్నారు. భారీ స్థాయిలో అంచనాలు ఉన్న ఈ సినిమాను వచ్చే మార్చి చివరి వారంలో ఉగాది కానుకగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పవన్‌కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్‌ నటిస్తుంది.

wp-1477478345159.png

 

తప్పకుండా షేర్ చెయ్యగలరు..