కాంతివంతమైన మరియు అందమైన చర్మం కోసం పేస్ ప్యాక్

కాంతివంతమైన మరియు అందమైన చర్మం కోసం పేస్ ప్యాక్

కాంతివంతమైన మరియు అందమైన చర్మం కోసం పేస్ ప్యాక్ ప్రతీ అమ్మాయికి ఉండే కల అందమైన మచ్చలు లేని చర్మం కలిగి ఉండటం. అందమైన ముఖము పొందటానికి అనేక రకముల స్కిన్ క్రీమ్స్ వాడి ఉంటారు. కాని మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదా? అయితే గృహ చిట్కాలను వాడటం మొదలు పెట్టండి. కెమికల్ ప్రొడక్ట్స్ వాడటం చర్మానికి హానికరం. శరీరంలో ఆక్సిజన్ మరియు రక్తం తక్కువగా ఉండటం మరియు ఎక్కువగా ఎండలో తిరగటం ద్వారా మీ చర్మం రంగు మారుతుంది. వాతావరణ కాలుష్యం వలన మీ చర్మం రంగు మారి మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. మీ చర్మానికి పోషకాలు అందకపోవడం మరియు ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవడం వలన కూడా చర్మం కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.

చర్మం నున్నగా ఉండట మరియు చర్మ రంగు మన అందానికి కారణం. అంతే కాకుండా మంచి శరీర రంగు కలిగి ఉంటే అన్ని రంగుల దుస్తులు ధరించవచ్చు. డార్క్ చర్మం కలిగిన ఉన్న వారికి అన్ని రంగుల దుస్తులు సెట్ అవ్వవు. అందరూ పుట్టుకతోనే మంచి రంగుతో పుట్టారు. కొన్ని సూచనలను పాటించడం వలన మీరు అందమైన చర్మాన్ని పొందగలరు. గృహ చిట్కాలను పాటించి అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

కాస్మటిక్ ప్రొడక్ట్స్ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి అని వినీ వినీ అలసిపోయారా? అవి వాడటం వలన మీకు ఎటువంటి ఫలితం కనిపించలేదా? అయితే మీరు ఇంటి చిట్కాలను వాడటం మొదలుపెట్టాలి. సహజమైన పేస్ ప్యాక్ వలన మీకు మంచి ఫలితం లభిస్తుంది. గృహ చిట్కాలను పాటించడం వలన మీ చర్మం మీద మొటిమలు, మచ్చలు తొలగించడమే కాకుండా మీ చర్మానికి మెరుపును అందిస్తాయి .

మీరు పార్లర్ మరియు సలూన్లకి పరుగుతీయ వలసిన అవసరం లేదు. మీరు మీ ఇంట్లోనే సులువుగా పేస్ ప్యాక్ వేసుకోవచ్చు. మేము అందమైన చర్మం కోసం చిట్కాలను అందిస్తున్నాం. అవి ఏంటో చూదాం.

మీ కోసం గృహ చిట్కాలు

పేస్ ప్యాక్

సగం టేబుల్ స్పూన్ తేనే, ఒక కప్పు టీ వాటర్ మరియు 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండిని తీసుకొని బాగా కలిపి పేస్టు తయారైన తరువాత ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయండి.15-20 నిమిషములపాటు అలానే ఉంచి రుద్దుతూ పేస్ ప్యాక్ని తొలగించాలి. రుద్దుతూ తొలగించడం చాలా ముఖ్యమైన పని ఎందుకంటే అలా చేయడం వలన చర్మ కణాలు ఉత్తేజంచెంది, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.

పసుపు

బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ పాలు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ నిమ్మరసం, సగం టేబుల్ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని తీసుకోవాలి. అన్నింటిని బాగా కలిపి పేస్టు చేసి ముఖానికి అప్లై చేయాలి, 15 నిమిషముల తరువాత ప్యాక్ ఆరిపోతే మంచి నీటితో కడిగి టవల్తో తుడవాలి.

పాలు మరియు తేనే

ఒక టేబుల్ స్పూన్ పాలు లేక పాల పొడి, ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు నిమ్మరసం తీసుకోవాలి. మూడింటిని బాగా కలిపి శుభ్రంగా ఉన్న మీ ముఖానికి వేసుకోవాలి. 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగండి.

పెరుగు మరియు వోట్మీల్

ఒక టేబుల్ స్పూన్ పెరుగు, టమాటో మరియు ఒక టేబుల్ స్పూన్ వోట్మీల్ కలిపి పేస్టు చేయండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషములు ఆరే వరకు ఉంచండి. పేస్ ప్యాక్ని కడుగుతూ రుద్దండి. రుద్దడం వలన చర్మ కణాలు ఉత్తేజం చెంది చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

బంగాళదుంప గుజ్జు

బంగాళదుంప చర్మ సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో విటమిన్-సి ఎక్కువగా ఉండటం వలన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బంగాళదుంప సహజంగా చర్మాన్ని తెల్లగా చేస్తుంది. బంగాళదుంప గుజ్జుని ముఖానికి అప్లై చేసి, 30 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా రోజూ చేయడం వలన మీ చర్మం కాంతివంతంగా, మృధువుగా తయారు అవుతుంది. మీరు బంగాళదుంప గుజ్జుతో నిమ్మరసాన్ని కూడా కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. నిమ్మలో బ్లీచింగ్ కారకం ఉండటం వలన మీకు తక్కువ సమయంలో ఫలితం కనిపిస్తుంది.

బాదం నూనె

తెల్లని చర్మం పొందాలి అంటే బాదం నూనెతో మీ ముఖానికి మద్దన చేయాలి. కొంచెం వేడి చేసిన నూనెను ఉపయోగించాలి. ఇది రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు చేసి చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. బాదంని మనం ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. రాత్రి అంతా బాదంని నానపెట్టి ఉదయాన్నే పేస్టు చేయండి. పేస్టులో కొంచెం మజ్జిగ కలిపి ముఖానికి వేసుకొని 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయటం వలన చర్మంలోని మృత కణాలు తొలగుతాయి.

పుదీనా ఆకులు

పుదీనా ఆకులకు తాజాతనాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నవి. పుదీనా ఆకులతో మీరు తెల్లని చర్మాన్ని పొందగలరు. అలానే ఇది రక్తాన్ని శుద్ది పరిచే గుణములను కలిగి ఉంది. పుదీనా ఆకుల పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇది చర్మ రంధ్రాలలోకి వెళ్లి సన్ టాన్ని తొలగిస్తుంది.

అరటిపండు

మీ చర్మానికి తెల్లదనం ఇవ్వడంలో అరటిపండు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అరటిపండును ఫేసు ప్యాక్గా ఉపయోగించడం వలన మీరు తొందరగా ఫలితాన్ని పొందగలరు. పసుపుగా పండిన అరటిపండు గుజ్జును తీసుకొని దానిలోకి టేబుల్ స్పూన్ తేనే మరియు పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషముల తరువాత నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీరు ప్రకాశించే చర్మాన్ని పొందటమే కాకుండా సన్ టాన్ నుంచి విముఖ్తి చెందగలరు.

ఎండిన నారింజ తొక్క

మీరు నారింజ తొక్కను ఎండలో ఎండపెట్టి పొడి చేసుకోవచ్చు, లేకుంటే మార్కెట్లో మీకు నారింజ తొక్కుల పొడి లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ నారింజ తొక్కుల పొడిలో పెరుగు కలిపి పేస్టు చేసి, ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి. ఇలా చేయడం వలన మీకు తెల్లని మరియు ప్రకాశవంతమైన చర్మం లభిస్తుంది.

గంధపు చెక్క

మీరు ఆయిలీ చర్మాన్ని కలిగి ఉన్నారా? మీరు తెల్లని చర్మం కావాలి అని ఆశ పడుతున్నారా? అయితే ఇది మీకు అద్భుతమైన చిట్కా. గంధపు పొడిని నీటితో కలిపి ముఖానికి అప్లై చేసి, ప్యాక్ ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడగండి. మీరు ఫలితాన్ని చాల తొందరగా గమనించవచ్చు.

తెల్లని మరియు ప్రకాశించే చర్మం కోసం సహజమైన పద్ధతులు

ఇంట్లో తయారు చేసిన పేస్ పాక్స్ ఎక్కువగా పాలు, తేనే, పెరుగు మరియు పండ్ల రసాలతో చేస్తారు. ఇవి చర్మానికి చాల మంచిది.

  • కుంకుమపువ్వు మరియు పాలతో చేసిన ప్యాక్ వాడటం వలన మీ చర్మం కాంతివంతంగా అవుతుంది. ఇది ఎక్కువగా డ్రై స్కిన్ కలిగిన వారికి ఉపయోగకరం. ఇది మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేయుటకు సహకరిస్తుంది. పచ్చిపాలు మీ చర్మాన్ని శుభ్ర పరచి ప్రకాశవంతంగా చేస్తాయి. పచ్చి పాలల్లో ఒక స్పూన్ కుంకుమపువ్వుని కలిపి 2 నిమిషముల పాటు చేతులతో మద్దన చేస్తూ ముఖానికి అప్లై చేసి, 15 నిమిషముల తరువాత నీటితో కడగండి.
  • పెరుగు మరియు వోట్స్ ప్యాక్ వలన మీ చర్మానికి వచ్చిన సన్ టాన్ మచ్చలను తొలగించవచ్చు. వోట్స్ చర్మంలోని మృత కణాలను తొలగించి, మొటిమలను చర్మంలో నుంచి బయటకు రాకుండా చేస్తుంది. వోట్స్ మరియు పెరుగుతో పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత చేతులతో మద్దన చేస్తూ చల్లని నీటితో కడగాలి.
  • నారింజ తొక్క మరియు గంధపు చెక్క, నారింజలో ఎక్కువగా కాల్షియమ్ మరియు విటమిన్ C ఉండటం వలన చర్మం మీద మచ్చలను మరియు దెబ్బలను నయం చేస్తుంది. ఈ రెండిటిని కలిపి వాడటం వలన చర్మ సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. అంతే కాకుండా ఇది మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఒక స్పూన్ గంధపు పొడి మరియు నారింజతొక్క పొడి తీసుకొని తగినంత నీరు కలిపి పేస్టు చేయండి. 5 నిమిషముల పాటు పేస్టుతో ముఖానికి మసాజ్ చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగండి.
  • స్ట్రాబెర్రి మరియు తేనేతో చేసిన ప్యాక్ వాడటం వలన మీ చర్మం మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ ఏ వయస్సులో ఉన్న వారికైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రెండు స్ట్రాబెర్రి పండ్లను తీసుకొని పేస్టు చేసి పాలు మరియు తేనే కలిపి ముఖానికి వేసుకొని 20 నిమిషముల తరువాత చల్లని నీటితో కడగండి.
  • నిమ్మరసం మరియు పాలపొడి ప్యాక్ని వాడటం వలన మీ చర్మం మీద మచ్చలను పోగొట్టి, చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతే కాకుండా చర్మం మీద వచ్చే మంటను పోగొడుతుంది. పాల పొడి, తేనే మరియు నిమ్మరసం కలిపి పేస్టు తయారు చేసి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో మసాజ్ చేస్తూ కడగండి.
  • వాల్నట్ మరియు పాల మీగడతో ప్యాక్, వాల్నట్లో ఎక్కువగా యాంటిఅక్సిడేన్త్స్, విటమిన్-ఇ, విటమిన్-బి ఎక్కువగా ఉండటం వలన మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మృత కణాలను తొలగిస్తుంది. ఇది వయస్సు పెరిగేకొద్ది వచ్చే ముడతలను తగ్గిస్తుంది. పాల మీగడ మీ చర్మం మంచి రంగులోకి తెస్తుంది.

మెరిసే చర్మం కోసం ఇంటి చిట్కాలు

అలోవేర

అలోవేర ఎక్కువగా మన ఇంటి పరిసరాలలో లభిస్తుంది, మన చర్మం అందంగా కనపడాలి అనే ఆశను నెరవేరుస్తుంది. హైపర్ పిగ్మెన్టేషన్ వలన మీ చర్మం రంగు మారుతుంది. అలోవేర మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.

అలోవేర ఆకుల గుజ్జును తీసుకొని చర్మానికి అప్లై చేసి 30 నిమిషముల తరువాత నీటితో కడగండి.

బొప్పాయి

పండిన బొప్పాయి మీ చర్మాన్ని మెరిసేలా చేయుటకు ఉపయోగపడుతున్నది. మీరు బొప్పాయిలో చాలా రకాలను చూసి ఉంటారు. కాని సహజంగా వచ్చిన బొప్పాయిపండులో బ్లీచ్ చేసే కారకాలు మరియు ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నవి. మీరు రెండు రోజులకి ఒకసారి బొప్పాయి తినడం వలన చర్మ మలినాలను తొలగించవచ్చు.

అంతే కాకుండా మీరు ఒక బొప్పాయి ముక్క తీసుకొని చర్మానికి మద్దన చేసి, 15-20 నిమిషముల తరువాత ప్యాక్ ఆరితే చల్లని నీటితో కడగండి. ఫలితాన్ని మీరు గమనించవచ్చు.

దోసకాయ

దోసకాయలో కొల్లజేన్ ఎక్కువగా ఉండటం వలన చర్మ కాంతిని పెంచుతుంది. దోసకాయను ఎక్కువగా తినడం వలన మీ చర్మం లోపల నుంచి మలినాలను తొలగించి, చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మీరు రెండు విధములుగా దోసకాయను ఉపయోగించవచ్చు. దోసకాయని వృత్తాకారంగా కట్ చేసి ఆ ముక్కలను ముఖానికి రుద్దుతూ ఉండాలి, ఒకసారి ఉపయోగించిన ముక్కని మరల ఉపయోగించరాదు. ఇలా చేయడం వలన దోసకాయ యొక్క రసం చర్మం లోపలకి వెలుతుంది. దీని వలన మీ చర్మం కాంతివంతంగా అవుతుంది. అలానే మిక్సర్ సహాయంతో దోసకాయని పేస్టు చేసి, ముఖానికి అప్లై చేసి ఆ ప్యాక్ ఆరే వరకు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత చల్లని నీటితో కడగండి

గులాభి రేకులు మరియు పాలు

గులాభి నీరు చర్మానికి చాలా మంచిది అని మీరు విని ఉంటారు, అలానే గులాభి ఆకులు కూడా చర్మాన్ని అందంగా చేస్తాయి. మీరు చేయవలసినది ఏమిటి అంటే? గులాభి రేకుల్ని బోయిల్ చేసి ముఖానికి అప్లై చేయండి.

గులాభి రేకులను ఎండపెట్టి పొడి చేయండి. పొడిలో పాలు కలిపి పేస్టు చేసి, ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితం కలుగుతుంది.

బాదం మరియు అరటి పండు

మీరు బాదం మరియు అరటిపండు యొక్క గుణములు విని ఉంటారు. కాని రెండిటిని కలపడం వలన అద్భుతమైన పరిష్కారాన్ని పొందవచ్చు. అరటిపండు చర్మంలోని స్థితిస్తాపకతను పెంచుతుంది. దీనిలో కొల్లజేన్ ఉండటం వలన చర్మ రంగును పెంచుతుంది. అరటిపండు గుజ్జుని తీసుకొని ఒక స్పూన్ బాదం ఆయిల్ కలిపి, ముఖానికి అప్లై చేయండి.

నిమ్మకాయ మరియు అలోవేర

అలోవేర ఆకుల నుంచి గుజ్జు తీసుకొని నిమ్మరసంతో కలపి ముఖానికి అప్లై చేయండి. తరువాత మెల్లిగా మీ చర్మానికి మద్దన చేయండి. అది మీ చర్మం లోపలకు వ్యాపిస్తుంది. కొంచెం సమయం తరువాత మంచి నీటితో కడగండి. తరువాత మీ చర్మం మృధువుగా అవ్వడం మీరు గమనిస్తారు.

తెల్లని చర్మం పొందుటకు ఈ చిట్కాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సహజ చిట్కాల వలన చర్మ సమస్యలను పరిష్కరించవచ్చు.