ఎలాంటి ఫోటోలు మీ ఇంట్లో ఉంటె…లక్ష్మీ కటాక్షం కలుగుతుందంటే…

wp-1479448658474.jpg
లక్ష్మీ దేవి కటాక్షం అందరూ కావాలనే కోరుకుంటారు. ఆమె రాకతో ధనంతో పాటు అదృష్టం, మనశ్శాంతి కూడా కలుగుతుంది. అందుకే ప్రతీ మనిషి తనకు అష్టైశ్వర్యాలు కలగాలని లక్ష్మీదేవి ని వివిధ రూపాలలో చిత్రపటాలను తెచ్చుకుని పూజిస్తారు. కొన్ని రకాల లక్ష్మీదేవి చిత్రపటాలను, బొమ్మలను లేక పంచ లోహాలతో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే ధననష్టం కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే లక్ష్మిదేవి చిత్రపటాలను ఎలాంటి వాటిని పూజించాలి, ఎలాంటి వాటిని పూజించకూడదో తెలుసుకుందాం…

గుడ్లగూబ పై కూర్చున్న లక్ష్మీదేవి బొమ్మని పూజించకూడదు. దీని వలన అంతా అశుభం జరుగుతుంది.ధనం వచ్చింది వచ్చినట్ట్టు పోతుంది.

wp-1479448672057.png
తామర పువ్వు పై లక్ష్మీదేవి నిలిచున్న ఫోటో కాకుండా, కూర్చున్న ఫోటోని పూజించాలి. దీని వలన అంతా శుభం జరిగి ఐశ్వర్యం సిద్దిస్తుంది.
గరుత్మంతుడి ఫై విష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటో ని పూజిస్తే… మిక్కిలి ధనం లభిస్తుంది.

wp-1479448722253.png
శేషకల్పం పై పవళించిన విష్ణువు కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి కూర్చొని ఉన్న ఫోటోని పూజిస్తే… ఆ దాంపత్యం అన్యోన్యంగా ఉంటాది.

wp-1479448744519.jpg
పాదరసంతో తయారు చేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. ధనం కూడా భాగా సమకూరుతుంది.

wp-1479448756437.png
లక్ష్మీదేవి ఒక్కరే ఉన్న ఫోటో కాకుండా ఏనుగులు రెండు వైపులా ఉండి, అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు ఉండే ఫోటోలను తీసుకుంటే మంచిది. తొండం ఎంత ఎత్తులో ఉంటె అంత మంచిది.

c2i_18102016114948
లక్ష్మీదేవి ఫోటోలో ఆమె చీర ఎరుపు లేదా ఆకుపచ్చ ఉంటె మంచిది. ఆకుపచ్చ చీర అయితే చాలా మంచిది.

wp-1479448780019.jpg
ఈ పద్దతులన్నీ పాటించి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి…