సమంత జనతా గ్యారేజ్ సినిమా తర్వాత ఏ సినిమాని అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. బహుశా అక్కినేని వారి కుటుంబ కోడలు అవ్వబోతుంది కాబట్టి ఇక సినిమాలు చేయదేమో అని అనుకున్నారు అంతా. కానీ ఇటీవల చైతు ఓ ఇంటర్వ్యూలో సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తుందని చెప్పాడు.

దాంతో ఆమె అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే సమంత తదుపరి సినిమా ఏమిటి అనేది అందరిలో నెలకొన్న ఆసక్తి. పీఎస్ మిత్రన్ దర్శకత్వమో రూపొందుతున్న ఇరుంబు తిరై అనే సినిమాలో హీరో విశాల్ సరసన సమంతను హీరోయిన్ గా చెయ్యమని అడిగేందుకు ఆ నిర్మాతలు సమంతను కలిశారని కోలీవుడ్ టాక్. ఒకవేళ కథ, అందులో తన పాత్ర నచ్చి సమంత ఒప్పుకుంటే…తదుపరి సమంత హీరో విశాల్ అవుతాడన్నమాట.

నాణ్యమైన వార్తలు అందిస్తున్న ఆంధ్రవిలాస్ ఇప్పుడు మీకోసం ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ ద్వారా అందిస్తుంది సో వెంటనే లైక్ చేయండి .ఇంకా ఆలస్యం ఎందుకు ఫేస్‌బుక్ లో లైక్ చేస్తూ ట్విట్టర్ లో ఫాలొ అవ్వండి.

Category:

Telugu Movies news