wp-1477583661105.png.
గత ఏడాది ‘బాహుబలి: ది బిగినింగ్’ ట్రైలర్‌ను ఎలా లాంచ్ చేశారో గుర్తుంది కదా. ఈ ట్రైలర్ కోసమే థియేటర్లలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి.. ఒక టైమింగ్ సెట్ చేసి.. ట్రైలర్ రిలీజ్ చేశారు. సినిమాల కోసం థియేటర్లకు వెళ్లినట్లే.. ‘బాహుబలి’ ట్రైలర్ కోసం థియేటర్లకు పరుగులు పెట్టారు ఆడియన్స్. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ కోసం కూడా ఇలాంటి ప్రత్యేక ఏర్పాట్లే చేస్తున్నారు.

డిసెంబరు తొలి వారంలో ‘శాతకర్ణి’ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వంద లొకేషన్లలో ‘శాతకర్ణి’ ట్రైలర్ ఒకేసారి లాంచ్ కాబోతుండటం విశేషం. ఇందుకోసం థియేటర్లను కూడా ఎంపిక చేశారు. బాహుబలి ట్రైలర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్రదర్శితమవగా.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ మాత్రం అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాల్లో లాంచ్ కాబోతోంది. బాలయ్య పెట్టిన ఒక ప్రత్యేక ముహూర్తంలో ట్రైలర్ లాంచ్ చేస్తారట. బాలయ్యకిది వందో సినిమా కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వంద లొకేషన్లలో ట్రైలర్ రిలీజ్ చేస్తుండటం విశేషం.
దసరాకు విడుదలైన ‘శాతకర్ణి’ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ట్రైలర్ దాన్ని మించేలా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్లో భారీ యుద్ధ సన్నివేశాల్ని చూపిస్తారట. టీజర్లో బాలయ్య మాత్రమే కనిపించగా.. ట్రైలర్లో హీరోయిన్ శ్రియ.. బాలయ్య తల్లి పాత్ర చేస్తున్న హేమమాలిని.. విలన్ కబీర్ బేడీ సహా ప్రధాన పాత్రధారులందరూ దర్శనమిస్తారట. మరి ఈ ట్రైలర్ ఎలాంటి అనుభూతిని పంచుతుందో చూద్దాం.

wp-1477583683495.jpg

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*