మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ ఫస్ట్ లుక్ కు సంబంధించి ఒక అధికారిక ప్రకటనతో కూడిన పోస్టర్ ను మెగా కాంపౌండ్ విడుదల చేసింది.  ఈ సినిమాలని చిరంజీవి లుక్ ను రేపు మధ్యాన్నం 2 గంటలకు విడుదల చేయబోతున్నారు. 

మెగాస్టార్ ఫస్ట్ లుక్ ఈసినిమాలో ఎలా ఉండబోతోంది అనే విషయం ఇప్పటికే చూచాయగా క్లారిటీ ఇస్తూ ఒక ఫస్ట్ లుక్ డిజైన్ ను విడుదల చేసినా చిరంజీవి లుక్ పై పూర్తి క్లారిటీ ఇస్తూ రేపు విడుదల అవ్వబోతున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండబోతోంది.  ఇప్పటికే అంచనాలు పెరిగి పోయిన ఈసినిమా బిజినెస్ కు పోటీగా ఒక్క ‘బాహుబలి 2’ తప్ప మరే సినిమా నిలబడలేక పోతోంది అంటే ‘ఖైదీ’ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.

దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు మెగా స్టైల్ తో దీవాళిని ఒకరోజు ముందే సెలెబ్రేట్ చేసుకోబోతున్నారు.   ఈ వార్తలు ఇలా ఉండగా మెగా అభిమానులు ఈ సినిమా గురించి వస్తున్న వార్తలతో ఫుల్ జోష్ లోకి వెళ్ళి పోతుంటే దర్శకుడు వినాయక్ కు మాత్రం ‘ఖైదీ’ కష్టాలు వెంటాడుతున్నాయి అని ఫిలింనగర్ లో గాసిప్పులు వెంటాడుతున్నాయి. 

‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటు ఉన్నా ఎక్కడో అతడికి ఈసినిమాకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉండటంతో ఈసినిమా నిర్మాణ విషయంలో చిరంజీవి తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాను తనకు ఎంతో ఆప్తుడైన వినాయక్ కు అప్పుచేప్పినప్పటికీ చిరూ వినాయక్ ను పూర్తిగా నమ్మడం లేదని ఫిలింనగర్ ఇన్ సైడ్ టాక్.


దీనితో ప్రతిరోజు చిరంజీవి ఈసినిమాకు సంబంధించిన రషెస్ చూసుకుని రోజువారీగా మార్పులు చేర్పులు చిరూ వినాయక్ కు చెపుతూ ఉండటం అతడికి ఏ మాత్రం నచ్చడం లేదు అని టాక్.  దీనికితోడు  మధ్యమధ్యలో రామ్ చరణ్ సలహాలతో పాటు ఈసినిమాకు కెమెరా మేన్ గా పని చేస్తున్న రత్నవేలు కూడ ఈసినిమా విషయంలో రకరకాల సూచనలు వినాయక్ కు ఇస్తూ ఉండటంతో వినాయక్ కు తీవ్ర అసౌకర్యంగా మారింది అని అంటున్నారు.  దీనితో వీలైనంత త్వరగా ఈసినిమా నుంచి బయట పడాలని వినాయక్ తొoదర పడుతున్నాడు అంటూ ఫిలింనగర్ లో గాసిప్పులు షికార్లు చేస్తున్నాయి..

Category:

Telugu Movies news