mahesh-babu-look-in-murugadoss-film-1477123155-1995తెలుగు స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత చిత్రం శ్రీమంతుడితో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన ప్రిన్స్… తాజాగా మురదాస్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ ద్విబాషా చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు తమిళంలలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సౌత్ పాపులర్ సినిమాటోగ్రాఫర్ గా సంతోష్ శివన్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ కు సంబందించిన లేటెస్ట్ స్టిల్స్ ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా మహేష్ బాబుతో పని చేయడం గురించి సంతోష్ శివన్ మీడియాతో మాట్లాడారు… మహేష్ బాబుతో పని చేయడం చాలా హ్యాపీగా ఉందని మహేష్ బాబు స్టార్ పవర్ అపరిమితం అని శివన్ పొగడ్తలతో ముంచెత్తారు. అనంతరం ఈయన పోస్ట్ చేసిన ఫోటోను మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేసారు. అయితే ఈ సినిమాకు సంబంధించి మహేష్ బాబు లుక్ బయటకు రావడం ఇదే తొలిసారి.

కాగా ఈ సినిమాను దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో డిసెంబరు కల్లా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంటి నాటికి విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*