ఇప్పుడు అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏమిటంటే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కి హోస్ట్ గా కింగ్ నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఎందుకు వస్తున్నారనేది అందరిలో తలెత్తుతుంది. దీనిలో స్టార్ మేనేజ్మెంట్ హస్తం ఉందని తెలుస్తుంది. కేవలం ఇది ఒక క్రియేటివ్ అండ్ బిజినెస్ పాయింట్ వ్యూ లో చూడమని విశ్లేషకులు అంటున్నారు.

‘కౌన్ బనేగా కరోడ్ పతి’ కార్యక్రమం హిందీలో హిట్ అయినట్టు ఇతర భాషల్లో హిట్ ఇవ్వలేదు. కానీ తెలుగులో మాత్రం ఇరగదీసింది. దానికి కారణం నాగార్జున హోస్ట్ చేయటమే. ఇప్పటికే నాగార్జున మూడు సీజన్ లను సక్సెస్ గా పూర్తి చేసారు. 

అయితే ఇప్పుడు మా టివిని హస్తగతం చేసుకున్న స్టార్ టివి వారు నాలుగో సీజన్ ని మరింత ఆసక్తిగా చేయాలనే ఉద్దేశంతో హోస్ట్ ని మార్చాలని అనుకోవటం మరియు నాగార్జున కూడా ఈ షో నుండి కొంత బ్రేక్ తీసుకుందామని నిర్ణయం తీసుకోవటంతో స్టార్ టివి కొత్త హోస్ట్ కోసం వేట సాగించింది. సమయంలో నాగ్ చిరు పేరును సూచించాడు. స్టార్ టివి వారు చిరుని అడగగానే ఒకే చెప్పేసాడు.

like-meమీకు నచ్చితే షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Telugu Movies news