wp-1479481328042.jpg
మనం అక్కడా ఇక్కాడా.. వింటూఉంటాం..వీడు ఏ రాశిలో పుట్టాడురా బాబు ఇలా చేస్తున్నాడు. ఏ ఘటియలో పుట్టిందిరా బాబు ఇది రాసి రంపాన పెడుతుందని చాల మంది ఇండ్లల్లో వినటం, మన ఇండ్లల్లో అనటం వింటావుంటాం. ఈ రోజున పుట్టినవారు ఇలా ఉంటారు. ఆ రాశిలో పుట్టిన వారు అలా ప్రవర్తిస్తారని మనం జనరల్ గా వింటూ ఉంటాము. అలానే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు..ఇందులో ఒక్కొక్క నెలలో పుట్టిన వారి మనస్తత్వం ఒక్కోలా ఉంటుందంట.! మరి మీరు పుట్టిన నెల ఎంటి? మీ మనస్తత్వం ఎట్టిదో ఇక్కడ చెక్ చేసుకోండి. ఏ సర్వే అయినా 100% కరెక్ట్ అని చెప్పలేము.. మంచి వ్యక్తిత్వం ఉన్న వారు దానినే కంటిన్యూ చేయండి. కాస్త తేడా అయితే వెంటనే మార్చుకోండి.

జనవరి: జనవరిలో పుట్టినవారు అందగాళ్లు.వారు కన్న కలల్ని జీవితంలో నిజం చేసుకుంటారు. వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. వీరికి పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టరు.

ఫిబ్రవరి: వీరు సన్నిత మనస్కులు. కొంచెం కోపం కూడా ఎక్కువే. ఎదుటివారిపై వెంటనే ఆ కోపాన్ని చూపిస్తారు. అంతలోనే నవ్వేస్తారు.

మార్చి: వీరు కొంచెం కళాహృదయులు. భావోద్వేగాలు ఎక్కువగా చూపిస్తారు. ఆ ఫీలింగ్స్ ఎక్కువ. తొందరగా రీయాక్ట్ అవుతారు.

ఏప్రిల్
:పక్కవాళ్లతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. టీంతో పనిచేయటం వీరికి సరదా..మంచి టీం వర్కర్. నమ్మకం ఎక్కువ. సున్నితమైన మనసు కలిగి ఉంటారు.

మే
:దేనికైనా తొందరగా ఆకర్షితులవుతారు. అందరిపై ప్రేమను ఒకేరకంగా చూపిస్తారు. ప్రేమ విషయంలో కొంచెం వీక్ తొందరగా అందరిని నమ్మేస్తారు.

జూన్
:వీరికి స్నేహం చేయటం ఇష్టం. కొత్తవాళ్లతో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. స్నేహితులతో కలిసి పరిహాసం చేయడం, ఆకర్షణీయమైన వ్యక్తులు కనిపించగానే ఇష్టపడతారు. వీరి చుట్టూ జనాలు ఉండాలనుకుంటారు.

జూలై:వీరికి అహంకారం ఎక్కువ. నేనే అన్నీ చేయాలనుకుంటారు. గొప్ప పేరు సంపాదించాలనుకుంటారు.అనుకున్నది జరగకపోతే నిరూత్సహపడుతారు. అహంకారం వల్ల సన్నిహితులు దూరం కావోచ్చు.

ఆగస్ట్
:వీరికి అనుమానం ఎక్కువ.ప్రతి విషయాన్ని అనుమానంతో చూస్తారు. అనుమానం మొదట పోయాకే..వీళ్లు వెనకాల వెలుతారు.ఎంత సరదాగా ఉంటారో..అంత రహస్యాలు పక్కనవారితో దాచుతారు. వీరికి సంగీతం అంటే ఇష్టం. జీవితంలో అలా కావాలి, ఇలా కావాలంటూ పగటి కలలు కంటారు. తీరకపోయేసరికి బాధపడుతారు.

సెప్టెంబర్
:స్నేహితుల సమస్యను తెలుసుకొని తీర్చడం, వారిని ఓదార్చడం ఎక్కువ. చాలా తెలివైన వారు, భయం అంటే తెలియదు, ప్రేమ మరియు మన అనుకున్న వారిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు.

అక్టోబర్
: చాట్ చేయడానికి ఇష్టపడతారు. అపద్ధం చెబుతారు కానీ నటించరు. స్నేహితులను తొందరగా బాధపెట్టిన మళ్ళీ కలగోపుగా మాటలు కలుపుతారు. చాలా స్మార్ట్, ఆకర్షనీయులు, హాట్ అండ్ సెక్సీ.

నవంబర్
:నమ్మదగిన వారు, విశ్వాసం ఎక్కువ. ఏదైనా చేయాలనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు. ప్రమాదకరమైన వారు కూడా. కలివిడిగా ఉంటారు. సీక్రెట్స్ చెప్పరు, స్వతంత్రంగా ఉంటారు.

డిసెంబర్
:చూడటానికి చాలా బాగుంటారు. విశ్వాసం ఎక్కువ, ఉదారమైన మనసు కలవారు. దేశభక్తి ఎక్కువ. ప్రతి విషయంలోనూ పోటీ పడతారు. అర్థం చేసుకోవడం చాలాకష్టం. ప్రేమగా ఉంటారు, సులభంగా హర్ట్ అవుతారు. పై నెలలతో పోల్చితే అన్ని విషయాలలోనూ ఉన్నతంగా ఉంటారు.

మీరు పుట్టిన నెలను బట్టి మీరెలాంటివారో చెప్పవచ్చు..!

మీ ఫ్రెండ్స్ కూడా షేర్ ….

Category:

Interesting news