మహేష్ బాబు.. నమ్రతల గారాలపట్టి సితార ఎప్పుడు ఏం చేసినా కూడా క్యూట్ గా అల్లరిగా బాగుంటుంది. గతంలో ఒక అవార్డ్స్ ఫంక్షన్ స్టేజీపై డ్యాన్సుతో అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఆ తరువాత నమ్రత షేర్ చేసిన ఏ ఫోటో చూసినా కూడా సితార చిలిపి అల్లరి భలే గమ్మత్తుగా ఉంటుంది. 

గతంలో తన డ్యాన్స్తో అందర్నీ మెప్పించిన సితార ఇప్పుడు తన బుజ్జిబుజ్జి చేతులతో చాక్లెట్ తయారు చేసేస్తోందట. సితార షెఫ్ గెటప్ లో చాక్లెట్ తయారు చేయడానికి ప్రయత్నిస్తుండగా తీసిన ఫొటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ”చాక్లెట్ మేకర్స్.. ఈ గ్యాంగ్ అక్కడున్న చాక్లెట్ మొత్తం తినేసింది” అంటూ నమ్రత కూడా తన ట్యాగ్ తో అందరినీ నవ్వించింది. మొత్తానికి క్యూట్ సితార చేసే అల్లరి పనులు చూశారా.. అసలు చాక్లెట్ మిక్సింగ్ అంటూ మొదలెట్టి ఇలా చాక్లెట్ తినేస్తే ఎలా సితార? మాక్కూడా కాస్త పెట్టవూ!!

ఇకపోతే నమ్రత కూడా ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తోందట. తను చిన్నప్పుడు మిస్ అయిన అల్లరి అంతా కూతురితో చేయిస్తోంది కాబోలు.