wp-1478170949355.jpg
భారత దేశం గొప్పతనం గురించి, దాని చరిత్ర గురించి ఎంత చదివినా తక్కువే. మన దేశంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు. వారు చేసిన గొప్ప పనులకు, సాధించిన ఘనతలకు ప్రపంచ దేశాల్లో భారత దేశం ఒక ప్రత్యేక చోటు సంపాదించుకుంది.

భారత దేశంలోని కొన్ని ఆసక్తికరమైన విహయాలు మీ కోసం:-

wp-1478088576639.jpgప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్లీ అసలు పేరు కృష్ణ పండిత్ భాంజీ. మహాత్మా గాంధీ జీవిత ఆధారంగా వచ్చిన గాంధీ అనే చిత్రం లో గాంధీగా కనువిందు చేసి ఆస్కార్, బాఫ్తా, గోల్డెన్ గ్లోబ్ వంటి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. ప్రిన్స్ అఫ్ పర్షియా, ఐరన్ మాన్ – 3, హ్యూగో వంటి చిత్రాలతో భారతీయులకు సుపరిచితుడు అయ్యాడు బెన్.

wp-1478088628420.jpg

భారతదేశానికి దేశానికి  చెందిన హాకీ ఆటగాడు ధ్యాన్ చంద్ 1928, 1932, 1936 లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. హాకీ క్రీడలో తిరుగులేని జట్టుగా కొనసాగుతున్న కాలం అది. ఇతని ఆటకు ఫిదా అయిపోయిన హిట్లర్, ధ్యాన్ చంద్ ను జర్మనీ దేశస్తుడిగా మారి జర్మనీ తరపున ఆడామని ఆహ్వానించాడు. ఈ ఆహ్వానాన్ని సునితంగా తిరస్కరించాడు ధ్యాన్ చంద్.

wp-1478170142914.jpg

భారత దేశంలో మొట్ట మొదటి రైల్ రోడ్డును నిర్మించింది బ్రిటీష్ వాళ్ళు అని అంత అనుకుంటారు. కాని వాస్తవానికి, ఇండియన్ రైల్వే అసోసియేషన్ నిర్మించింది ఇద్దరు భారతీయులు. వారే జగన్నాథ్ శున్కర్సేత్ మరియు జమ్షేత్ జీ జీజీభోయ్. 1845లో మొదటి రైల్ ప్రయాణం ముంబై నుండి తానే వరకు కొనసాగింది. గమ్య స్థలానికి చేరుకోడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది.

wp-1478170191925.jpg

1990లో మానవ చరిత్రలోనే అతి పెద్ద విమాన తరలింపు చోటు చేసుకుంది. దాదాపు 1,76,000 మంది భారతీయులు నివసిస్తున్న కువైట్ ను ఇరాక్ ముట్టడించింది. ఆ సమయంలో డబ్బు, ఇల్లు ఇలా అన్నీ కోల్పోయి, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్నారు అక్కడి భారతీయులు. కువైట్ ప్రభుత్వం కూడా ఏమి చెయ్యలేని పరిస్థితి. ప్రాణాలకు తెగించి 59 రోజులు పగలనక రేయనక కష్టపడి, 488 ఎయిర్ ఇండియా విమానాలల్లో భారతీయులను తిరిగి మన దేశానికి తీసుకొని వచ్చారు. ఈ సంఘటన ఆధారంగా ఎయిర్ లిఫ్ట్ అనే పేరుతో ఇటీవల ఒక బాలీవుడ్ చిత్రం కూడా వచ్చింది. ఇందులో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషించాడు.

wp-1478170235504.jpg

దేశంలో టెక్ కాపిటల్ గా పేరు పొందిన బెంగళూర్, 2006 నుండి నేటి వరకూ 6 రెట్లు పెరిగింది. సింగపూర్ దేశంతో పోలిస్తే బెంగలూరు నగరంలోనే, గ్రేడ్-A ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు వెల్లడయ్యింది.
మన దేశానికి చెందిన యుద్ధ క్షిపణి (వార్ మిస్సైల్) అగ్ని – III, ప్రపంచంలో కల్లా కచ్చితమైన (అక్యురేట్) మిస్సైల్ గా నిరూపించుకుంది. అలాగే దీని బ్రహ్మోస్ ప్రపంచం లోనే అత్యంత వేగవంతమైనదిగా పేరు పొందింది. బ్రహ్మోస్ అనగా, నేల నుండి , నీటి పై నుండి , నింగి నుండి, ఇలా ఎక్కడనుండైనా ఆపరేట్ చెయ్యగలిగేది అని అర్ధం.

wp-1478170331080.jpg

దేశంలో టెక్ కాపిటల్ గా పేరు పొందిన బెంగళూర్, 2006 నుండి నేటి వరకూ 6 రెట్లు పెరిగింది. సింగపూర్ దేశంతో పోలిస్తే బెంగలూరు నగరంలోనే, గ్రేడ్-A ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు వెల్లడయ్యింది.

wp-1478170403095.jpg

భారత దేశంలో అత్యంత ధనవంతులైన టాప్-25 మంది ఆస్తుల వేల దాదాపు 174.5 బిలియన్ డాలర్లు. అంటే 46 మిలియన్ల జనాభా ఉన్న యుక్రెయిన్ దేశపు సాముదాయక దేశీ ఉత్పత్తి (GDP) కన్నా ఎక్కువ.

wp-1478170444295.jpg

1991 లో ప్రపంచంలోనే తొలి హాస్పిటల్ ట్రైన్ ను ప్రారంభించారు మన భారతీయులు. ఈ రైలుకు లైఫ్ ఎక్స్ ప్రెస్  అని పేరు పెట్టారు. మన దేశంలో సరైన వైద్య సేవ అందని చోటుకి ఈ రైలు ద్వారా వెళ్లి సేవలు అందిస్తుంటారు వైద్యులు.

wp-1478170500081.jpg

లడఖ్ వ్యాలి లో, హిమాలయ పర్వతాల వద్ద డ్రాస్ మరియు సురు నదుల మధ్య ఉన్న బైలీ బ్రిడ్జీ ప్రపంచంలోనే అత్యంత ఎతైన బ్రిడ్జీగా పేరు పొందింది. 1982లో భారత సైన్యం దీనిని నిర్మించింది.

wp-1478170540400.jpg

ఇతర దేశాలకు ఉద్యోగులను పంపడంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో ఇలా ఇతర దేశానికి పని చేసే వారిలో సగానికి పైన భారతీయులే ఉన్నారు. వీరి ద్వారా సంవత్సరానికి ఆయా కంపెనీలు సంపాదిస్తున్న డబ్బు దాదాపు 47 బిలియన్ డాలర్లు.

wp-1478170581002.jpg

ప్రపంచాన్ని పీడిస్తున్న అత్యంత భయంకరమైన జబ్బులలో ఎయిడ్స్ ఒకటి. 2001లో మన దేశానికి చెందిన సిప్లా అనే ఒక డ్రగ్ కంపెనీ ఒక మందు కనుగొంది. రోజుకి కేవలం రూ.70 వ్యయం తో ఈ మందుని వాడొచ్చు.

wp-1478170639402.jpg

ప్రపంచంలోకెల్ల అత్యంత పెద్ద చిత్ర పరిశ్రమ మన దేశానిదే. అమెరికా, కెనడా చిత్ర పరిశ్రమలు రెండు కలిపినా మన దేశానికన్నా చిన్నవే. 2015లో మన దేశంలో 3.2 బిలియన్ సినిమా టికెట్లు అమ్ముడుబోయాయి.

wp-1478170696188.jpg

గోల్డెన్ టెంపుల్ లో లంగర్ అని పిలవబడే ఫ్రీ కిచెన్, రోజుకి లక్ష మందికి పైన ఉచిత ఆహారాన్ని అందిస్తుంది. ప్రపంచంలో వేరెక్కడా ఇలాంటి సౌకర్యం కలిపించే చోటు లేదు.

wp-1478170745872.jpg

భారత్ మరియు చైనా సరిహద్దున ఉన్న కైలాష్ అనే పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ అధిగమించలేదు. చైనా ప్రభుత్వం అధిరోహకులకు ఇది సాధించడానికి అనుమతించినా, ఇప్పటి వరకు ఎవ్వరూ ఇది చెయ్యలేక పోయారు.

wp-1478170793107.jpg

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, సెల్ ఫోన్ వినియోగాదారులల్లో భారత దేశానిదే పైచేయి. నమ్మలేని విధంగా 2001తో పోలిస్తే, 2011 కల్లా, అంటే 10 సంవత్సరాలలో సెల్ ఫోన్ వాడే వారి సంఖ్య మన దేశంలో 16,240 శాతం పెరిగిపోయింది.

wp-1478170840924.jpg

అత్యంత నిజాయితీ పరులు మన దేశంలోనే ఉంటారు అనడానికి ఇదే నిదర్శనం. మిజోరాం రాష్ట్రంలోని ఒక రహ దారిపై ఒక కొట్టు ఉంటుంది. ఈ కొట్టులో పక్కన ఉన్న అడవి నుండి తెచ్చిన కూరగాయలు, పండ్లు, పూలు వంటివి దొరుకుతాయి. విచిత్రం ఏమిటంటే ఈ కొట్టును చూసుకునేవారు ఎవ్వరూ అక్కడ ఉండరు. బోర్డులో ఉన్న రేటు ప్రకారం, అక్కడ ఉన్న డబ్బాలో డబ్బులు వేసి వెళ్లిపోవచ్చు. చిల్లర లేని వారు అదే డబ్బానుండి చిల్లర కూడా తీసుకుంటారు.

wp-1478170867262.jpg

10వ శతాబ్దంలో నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంకేల్ల అత్యంత భారి సంఖ్యలో భక్తులు సందర్శించే ప్రదేశంగా రుజువు అయ్యింది. రోమ్ మరియు మక్కా కన్నా ఎక్కువ, అంటే రోజుకి దాదాపు 30,000 మంది ఈ గుడిని దర్శించుకుని, 40 కోట్లు విలువ చేసే విరాళాలు ఇక్కడ అర్పించుకుంటారు.

మీ మిత్రులకు మరియు ప్రతీ భారతియుడు కీ షేర్ చేయండి

Category:

Interesting news