ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యువ హీరో దగ్గుబాటి రాణా కలయిలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి2’. దీనికి  సంబంధించి రాణా ఇటీవలే తన ట్విట్టర్ ఖాతాలో  బాహుబలి లో చూపించబోయె సిక్స్ ప్యాకు ను మొదటి సారి చూపిస్తు ఔరా అనిపించుకున్నాడు. ఈ పోస్టర్‌లో  రాణా చొక్క మాటున దాగి ఉన్న సిక్స్ ప్యాక్ లుక్‌ని మనం గమనించవచ్చు.

‘బాహుబలి’లో ‘రానా’ సుమారు 110 కిలోల బరువు ఉండేవాడంట. రెండో భాగంలో మాత్రం బరువు తగ్గాల్సి ఉండటంతో దానికోసం రాణా భారీగా కరసత్తులు చేసి బరువు తగ్గించుకునే పనితో పాటు శరీరాకృతిని పెంచుతున్నారు. అయితే ఈ పని అంతా కోచ్ పర్యవేక్షనలో జరుగుతోంది.  ఈ సందర్భంగా తీసిన ఓ ఫోటోను ‘రానా’ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుని విస్మయానికి గురిచేశాడు. రానున్న సినిమాలో  రాణానే ఇంత కండలు తిరిగేల చూపిస్తున్న రాజమౌళి మరి బాహుబలుడు ‘ప్రభాస్’ను ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో, ప్రభాస్ తన బాడీ పెంచడానికి ఎలా కసరత్తులు చేస్తున్నాడో అని ఆశక్తిగా మారింది. ఇదిలా ఉండగా బహుబలిలో ఓ దృడమైన జంతువు  పంతం పట్టిన బల్లాలుడు మరింత కండలు పెంచిన బహుబలి2లో ఇంక ఎంత పెద్ద జంతువుతో పోటీ పడుతాడోఅనే ఆశ్చర్యం కలగకపోలేదు… ఏదేమైనా ఇలాంటి సందేహాలు తీరాలంటే బాహుబలి2 రిలీజ్ వరకు వేట్ చేయాల్సిందే…

like-meమీకు నచ్చితే షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Telugu Movies news