టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లో కూడా డిస్ట్రిబ్యూటర్లు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా.. బాహుబలి -2. మొదటి భాగానికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో రెండో భాగం ఎప్పుడు బయటకు వస్తుందా, దాన్ని ఎలా పంపిణీ చేసి మంచి లాభాలు ఆర్జిద్దామా అని అంతా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంటుండటంతో బిజినెస్ కూడా మొదలైపోయింది.

తాజాగా ఈ సినిమా నైజాం ఏరియా హక్కుల అమ్మకాలు కూడా జరిగిపోయాయి. ఎంతకు వెళ్లాయన్న విషయం బయటకు రాలేదు గానీ.. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఈ హక్కులను కొనుగోలు చేశారని మాత్రం తెలిసింది. ఈ విషయాన్ని స్వయంగా బాహుబలి సినిమా తన అధికారిక ట్విట్టర్ పేజి ద్వారా వెల్లడించింది.

like-meమీకు నచ్చితే షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Telugu Movies news