1477035820-1583‘బాహుబలి: ది కంక్లూజన్’లో సూర్య ఓ కీలక పాత్ర చేస్తాడని.. బాలీవుడ్ హీరోయిన్ ఒకరు నటిస్తారని.. ఇలా రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఐతే వాటన్నింటినీ రాజమౌళి బృందం ఖండించింది. దాదాపుగా తొలి భాగంలో నటించిన వాళ్లతోనే రెండో భాగాన్ని కొనసాగిస్తోంది. ఐతే ఒక కొత్త హీరోయిన్ మాత్రం ‘బాహుబలి-2’లో ఒక కీలక పాత్ర చేస్తోందన్నది తాజా కబురు. ఆ అమ్మాయి పేరు ప్రియా నాయుడు.

ఈ అమ్మాయిది బెంగళూరు. ఆల్రెడీ కృష్ణవంశీ సినిమా ‘నక్షత్రం’ ప్రియ ఒక క్యారెక్టర్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా తన గురించి రాజమౌళికి తెలిసిందట. ఆమెకు సంబంధించిన రషెస్ చూసి.. తనకు ‘బాహుబలి: ది కంక్లూజన్’లో ఒక పాత్ర ఇచ్చాడట రాజమౌళి. దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బాహుబలి-2″లో పాత్రంటే మామూలు విషయం కాదు. అది చిన్న పాత్ర అయినా సరే.. వచ్చే పేరు ఎంతో ఉంటుంది. అందుకే ఆ పాత్ర చేయడానికి రెడీ అయిపోయింది ప్రియా నాయుడు.

‘బాహుబలి: ది కంక్లూజన్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇప్పటికే వార్ ఎపిసోడ్ మొత్తం అవగొట్టేశాడు రాజమౌళి. ఇంకో నెల రోజుల్లో టాకీ పార్ట్ మొత్తం అయిపోవచ్చని సమాచారం. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసి విడుదల తేదీకి కొన్ని వారాల ముందే ఫస్ట్ కాపీ చేతికి తీసుకోవాలన్న లక్ష్యంతో సాగుతున్నాడు రాజమౌళి. 2017 ఏప్రిల్ 28న ఈ చిత్రం తెలుగు.. హిందీ.. తమిళం.. మలయాళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Category:

Telugu Movies news