బాహుబలి.. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద సగర్వంగా నిలబెట్టిన విజువల్ వండర్. ఇప్పటికే ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకున్న ఈ భారీ చిత్రం ఇప్పుడు సీక్వల్తో మరోసారి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. తొలి సినిమా సంచలన విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగంపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ లోగో తప్ప మరే పోస్టర్ రిలీజ్ చేయకపోయినా సినిమా మీద హైప్ మాత్రం ఓ రేంజ్లో ఉంది.

ఆ అంచనాలు మరింతగా పెంచేందుకు తొలి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు బాహుబలి యూనిట్. ముంబైలో జరుగుతున్న మామీ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఈ రోజు(శనివారం) సాయంత్రం 4 గంటలకకు బాహుబలి 2 తొలి పోస్టర్‌తో పాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. అయితే సినిమా మీద ఉన్న హైప్‌తో ఈ పోస్టర్ టీజర్లు సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో సరికొత్త రికార్డ్లను సృష్టించటం కాయం అన్న టాక్ వినిపిస్తోంది.

ఏప్రిల్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు ఈ రోజు నుంచి అధికారంగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. తొలి భాగం సక్సెస్‌లో ప్రమోషన్ ప్రముఖ పాత్ర పోషించిన నేపథ్యంలో రెండో భాగానికి కూడా అదే స్థాయిలో భారీ ప్రచారం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

తప్పకుండా షేర్ చెయ్యగలరు..

Category:

Telugu Movies news