మెగాస్టార్ చిరంజీవి 150.. యువ‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ 100.. ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో వినిపిస్తోన్న రెండు క్రేజీ సినిమాలు ఇవి. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్‌లు చ‌కా చ‌కా జ‌రుగుతున్నాయి. అగ్ర హీరోలు అయిన బాల‌య్య‌, చిరుకు ఈ రెండు సినిమాలు ల్యాండ్ మార్క్ సినిమాలే వీటిల్లో చిరు సినిమాకు నెపోలియ‌న్ అన్న టైటిల్ ఖ‌రారైంది. ఈ సినిమాకు స్టార్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక బాల‌య్య సినిమాకు విభిన్న చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా హిస్టారిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది.

అయితే ఈ రెండు సినిమాల‌తో ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వ‌ద్ద ఒకేసారి పోటీప‌డుతూ త‌మ అభిమానుల‌కు పెద్ద మ‌జాను మిగ‌ల్చ‌నున్నారు. ఈ ఇద్ద‌రు హీరోలు దాదాపు 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డుతున్నారు. 2001లో వ‌చ్చిన న‌ర‌సింహ‌నాయుడు-మృగ‌రాజు సినిమాలు సంక్రాంతికి పోటీప‌డ్డాయి. అప్పుడు బాల‌య్య‌దే పైచేయి అయ్యింది. త‌ర్వాత చివ‌రిసారిగా 2004లో కూడా సంక్రాంతికి బాల‌య్య ల‌క్ష్మీన‌ర‌సింహా, చిరు అంజి పోటీప‌డ‌గా మ‌రోసారి బాల‌య్య‌దే పైచేయి అయ్యింది.

మరి వ‌చ్చే సంక్రాంతికి జ‌రిగే బాక్సాఫీస్ వార్‌లో ఎవ‌రు పైచేయి సాధిస్తారో చూడాలి. స్వయంగా బాలకృష్ణే తన సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసాడు. జనవరి 12, 2017న వస్తామని ప్రకటించాడు. ఇక చిరు సినిమా జనవరి 13, 2017న విడుదల కానుంది. వినాయక్‌ కూడా సంక్రాంతికి సినిమా వస్తుందని కన్ఫర్మ్‌ చేసాడు.మొత్తానికి బాలయ్య-చిరంజీవి ఫైట్ 13 ఏళ్ల తర్వాత బాక్సాఫీస్‌ దగ్గర కనువిందు చేయనుంది. ఒకరేమో చరిత్రను తీసుకొస్తున్నారు.. మరొకరు రైతు సమస్యలను తీసుకొస్తున్నారు. మరి ఎవరిని విజ‌యం వ‌రిస్తుందో చూడాలి.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి… like-me