wp-1477136603145.jpgప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 కోసం ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతటి సంచలనం సృష్టించి, సినిమాపై హైప్ పెంచాడు జక్కన్న. బాహుబలి సినిమాని భారీ సబ్జెక్ట్ తో తీసి, అదే విధంగా భారీ వసూళ్లు రాబట్టి తెలుగు ఇండస్ట్రీ లో ఏ సినిమా సినిమా రికార్డ్స్ ని అయినా…బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని లెక్కలు వేసుకునే స్థాయికి ఈ సినిమాని తీసుకెళ్ళాడు జక్కన్న.

ఇప్పుడు బాహుబలి2 ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం వెనుక కూడా ఇటువంటి పథకంతోనే ముందుకు వెళ్తున్నాడు జక్కన్న. అసలు విషయం ఏమిటంటే….ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే అంటే ఈరోజు సాయంత్రం ప్రభాస్ లుక్ ని విడుదల చేయనుంది బాహుబలి యూనిట్. ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని నిమిషం నిడివి గల మేకింగ్ వీడియోని విడుదల చేస్తున్నారట.

ఒకప్పుడు నార్మల్ గా మేకింగ్ వీడియో ని విడుదల చేసిన రాజమౌళి, వివిధ ప్రాంతాల్లో రైట్స్ కి భారీ రేటుకు అమ్ముడవడం కోసం ఈ హంగామా ప్లాన్ చేస్తున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తుంది. ఈ వీడియోని రాజమౌళి కొడుకు కార్తికేయ అధ్వర్యంలో రెడీ అయినట్లు యూనిట్ చెబుతున్నమాట. మొత్తానికి రాజమౌళి సెన్సేషన్ డైరెక్టర్ మాత్రమే కాదు సెన్సాఫ్ యూమార్ ఉన్న బిజినెస్ మెన్ అని కూడా నిరూపించుకున్నాడు.

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*