ప్రభాస్ ను తిట్టిపోస్తోన్న తమిళ మీడియా!

ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన తెలుగు చిత్రం బాహుబలి. దర్శకుడు రాజమౌళితో పాటు ప్రభాస్‌కు అంతర్జాతీయ గుర్తింపు నిచ్చింది ఆ చిత్రం. దానితో పాటే ప్రభాస్ కు ఓ అరుదైన గౌరవాన్ని కూడా ఇచ్చింది. ప్రపంచంలోని ప్రముఖుల మైనపు విగ్రహాల మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్ లో త్వరలో ప్రభాస్ విగ్రహం కూడా పెట్టనున్నారు. ఇటీవలే మ్యూజియం ప్రతినిధులు వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభాస్ అభిమానులు చాలా సంతోష పడ్డారు. అయితే కొందరు మాత్రం దీనికి విపరీతార్థలు తీసి రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఓ తమిళ పత్రిక ప్రభాస్ మైనపు విగ్రహంపై తమిళ సెలెబ్రిటీల అభిప్రాయాలను ప్రచురించింది. ప్రభాస్‌కు మైనపు విగ్రహమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభాస్‌ వంటి వ్యక్తికే మైనపు విగ్రహం పెడితే.. మరి రజనీకాంత్, కమల్‌హాసన్‌ల విగ్రహాలు ఎందుకు పెట్టకూడదని అక్కసు వెళ్లకక్కింది. ప్రభాస్ మైనపు విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ వార్తలు రాసింది.

like-me

 షేర్ చేయండి మరియు మీ Reaction చెప్పండి…..

Category:

Telugu Movies news

Powered by Dragonballsuper Youtube Download animeshow