పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో | Pawan Kalyan Trivikram new story confirmed

పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ వరుస సినిమాలతో బిజీ బిజీగా మారబోతున్నాడా ? ఏకంగా నాలుగు సినిమాల్లో నటించబోతున్నాడా ? అంటే టాలీవుడ్ లో అవుననే టాక్ వినిపిస్తోంది. ఎన్నికలు వచ్చే నాటికి ఈ సినిమాలన్నీ రిలీజ్ చేయాలని ‘పవన్’ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అనంతరం ‘పవన్’ కాటమరాయుడు’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ‘డాలి’ డైరెక్ట్ చేస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిసున్నారు.

ఈ చిత్రాన్ని 2017 ఫిబ్రవరి మాసంలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. దీని అనంతరం మాటల మాంత్రికుడు ‘తివిక్రమ్’తో ఓ సినిమా చేయనున్నారు. అనంతరం మరో రెండు సినిమాలకు ‘పవన్’ సైన్ చేయనున్నారని టాక్. ఈ సినిమాలన్నీ 2018 నాటికి పూర్తి కావాలని ‘పవన్’ ప్లాన్ వేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘జనసేన’ పార్టీతో ‘పవన్’ రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలు మొదలయ్యే సమయానికి బిజీగా ఉండాల్సినవసరం ఉంటుందని, అందుకే వీలైనన్నీ సినిమాలు చేయాలని ‘పవన్’ అనుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2017లో రెండు..2018లో మరిన్ని చిత్రాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. మరి ఇది నిజమా ? కాదా ? అనేది తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి… like-me

Category:

Telugu Movies news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*